భారత మాజీ దిగ్గజం, ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. అందుకు అతని నోటిదూలే కారణం. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో హిందీ కామెంటేటర్‍గా వ్యవహరించిన హర్భజన్.. భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ సతీమణులపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దాని ఫలితం అతనికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి.
హర్భజన్ ఏమన్నారంటే..?
భారత ఇన్నింగ్స్ కోహ్లీ, రాహుల్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అనుష్క శర్మ, అతియా శెట్టిలు వారి భర్తలను ఎంకరేజ్ చేస్తూ కనిపించారు. ఆ దృశ్యాలను కెమెరామెన్ పదే పదే వారిని స్క్రీన్‌పై చూపించారు. ఆ సమయంలో వీరిద్దరూ ఏదో విషయమై సీరియస్‌గా చర్చించుకుంటున్నట్లు కనిపించారు. ఈ సన్నివేశంపై స్పందించిన హర్భజన్.. "వారి మధ్య సంభాషణ సినిమాల గురించి జరుగుతుందా? లేక క్రికెట్ గురించా? ఎందుకంటే వాళ్లకు క్రికెట్ గురించి ఎంత అవగాహన నాకు ఉందో తెలియదు.." అంటూ మహిళలను కించపరిచేలా వ్యాఖ్యానించాడు.
Harbhajan Singh shouldn’t be part of commentary. He is misogynist. @harbhajan_singh
— Dee ♥️ (@deeptantalizing) November 19, 2023
apologise immediately. @AnushkaSharma@theathiyashetty@klrahul@imVkohli pic.twitter.com/2yQOZvV7CR
కదం తొక్కిన మహిళా సంఘాలు!
హర్భజన్ చేసిన ఈ వ్యాఖ్యలపై నెటిజన్లు, మహిళా సంఘాల నాయకురాళ్లు అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. హర్భజన్ ఒక సెక్సిస్ట్, స్త్రీద్వేషి అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. స్త్రీ ద్వేషమనేది రోజురోజుకీ పెచ్చుమీరిపోతోందని.. భారత క్రికెటర్‌గా మంచి గుర్తింపు పొందిన హర్భజన్ లాంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సమంజసమా! అని వారు ప్రశ్నిస్తున్నారు. వెంటనే భజ్జీ.. అనుష్కశర్మ, అతియా శెట్టిలకు క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మొత్తానికి ఇలా మన భజ్జీ నోటి దూలతో వినరాని మాటలు అనిపించుకుంటున్నారన్నమాట.
Harbhajan Singh, made a rather 'misogynistic' remark where he questioned the actresses' understanding of cricket.
— Mahua Moitra Fans (@MahuaMoitraFans) November 19, 2023
Harbhajan, during the commentary, said, "Aur yeh main soch raha tha ki baat cricket ki ho rahi hai ya filmon ki. Kyunki filmon ke barein mein toh janta nahi kitni… pic.twitter.com/2gCjnj6QSO