మీరు మారరు.. మీ బుద్ధి మారదు: పాక్ అభిమానిని ఏకిపారేసిన హర్భజన్

మీరు మారరు.. మీ బుద్ధి మారదు: పాక్ అభిమానిని ఏకిపారేసిన హర్భజన్

గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ లో దాయాది పాకిస్థాన్ జట్టు పేలవ ప్రదర్శన చేసింది. 9 మ్యాచ్‌లకుగాను కేవలం నాలుగే నాలుగు విజయాలు అందుకొని లీగ్ దశలోనే ఇంటిదారి పట్టింది. ఈ ఫలితాల అనంతరం ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాం కెప్టెన్సీ కూడా కోల్పోయాడు. స్వదేశానికి చేరుకున్న మరుక్షణం మూడు ఫార్మాట్ల నాయకత్వ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. అలాంటి బాబర్ ఆజాం ఇంటర్వ్యూ కోసం భారత మాజీ  క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ పాకులాడారట. 

వన్డే ప్రపంచ కప్ సందర్భంగా ఇర్ఫాన్ పఠాన్‌ స్టార్ స్పోర్ట్స్ కామెంటేటర్‌గా పని చేశారు. ఆ సమయంలో తమ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వాల్సిందిగా బాబర్‍ను అడగ్గా, అందుకు పాక్ కెప్టెన్ అంగీకరించలేదని ఆ దేశ అభిమాని ఒకరు నెట్టింట రాసుకొచ్చారు. అయితే, ఈ ఊహాజనిత కథను మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కొట్టి పారేశారు. ఫేక్ న్యూస్ షేర్ చేసిన పాకిస్థాన్ అభిమానికి హర్భజన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

వీడియోలో ఇర్ఫాన్ పఠాన్ ఎక్కడ..?

"ఈ వీడియోలో ఇర్ఫాన్ పఠాన్ ఎక్కడ ఉన్నారు.. ??  బోల్నే కి తమీజ్ తో ఆప్ లోగో కో పెహ్లే హాయ్ నహీ థీ. అబ్ ఆంఖో సే దిఖ్నా బి బంద్ హో గ్యా క్యా? వైసే బి అగర్ అంగ్రేజీ మై స్వల్ పూచ్ లియా తో పాంగే పాడ్ జాయేంగే (ఇంతకుముందు మాట్లాడే మర్యాద మీ ప్రజలకు లేదనుకున్నా.. ఇప్పుడు కళ్లతో చూడటం కూడా మానేశారా? ఎలాగూ ఇంగ్లీషులో ప్రశ్న వేస్తే చిక్కుల్లో పడతారు..)" అని హర్భజన్ రాసుకొచ్చారు.

కాగా, రెండు నెలల క్రితం జరిగిన టీ20 ప్రపంచ కప్ 2024లో బాబర్ ఆజం మరోసారి పాకిస్థాన్‌ జట్టుకు నాయకత్వం వహించాడు. ఇందులోనూ పాక్ గ్రూప్ దశలోనే ఇంటిదారి పట్టింది.