Champions Trophy 2025: జైశ్వాల్‌కు ఛాన్స్ లేదు.. గిల్ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడతాడు: హర్భజన్ సింగ్

Champions Trophy 2025: జైశ్వాల్‌కు ఛాన్స్ లేదు.. గిల్ ప్రతి మ్యాచ్‌లోనూ ఆడతాడు: హర్భజన్ సింగ్

ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత వన్డే జట్టులో తొలిసారి యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ చోటు దక్కించుకున్నాడు. బ్యాకప్ ఓపెనర్ గా సెలక్ట్ అయిన జైశ్వాల్.. తుది జట్టులో స్థానం కష్టంగానే కనిపిస్తుంది. ప్రస్తుతం వన్డేల్లో భారత జట్టు ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యువ సంచలనం శుభమాన్ గిల్ ఆడుతున్నారు. రెండేళ్లుగా వీరు వన్డే జట్టులో నిలకడగా రాణిస్తున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్ కావడం.. గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించడంతో జైశ్వాల్ తుది జట్టులో ఆశలు వదులుకోవాల్సిందే అని భారత మాజీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ అన్నారు. 

హర్భజన్ సింగ్ తన యూ ట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. " ఛాంపియన్స్ ట్రోఫీకి శుభమాన్ గిల్ ను వైస్ కెప్టెన్ గా ప్రకటించారు. ఇప్పుడే జైశ్వాల్ ను ప్లేయింగ్ 11 లో చేర్చడం కష్టంతో కూడుకున్నది. రోహిత్ శర్మతో వైస్‌ కెప్టెన్‌గా గిల్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభించనున్నాడు. గిల్ ను మూడో స్థానానికి పంపించడం కుదరదు. ఎందుకంటే మూడో స్థానంలో కోహ్లీ బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ గిల్ మూడో స్థానంలో.. ఆడితే కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాలి. అప్పుడు శ్రేయాస్ అయ్యర్ ను ఆడించడం కుదరదు. ఫామ్ లో ఉన్న జైశ్వాల్ ఆడితే బాగుంటుంది అని నేను భావిస్తున్నాను". అని హర్భజన్ సింగ్ అన్నారు. 

ALSO READ | IND vs ENG: నా ఆట అంతే అంటే కుదరదు.. ఇకనైనా పంత్ మారాలి: సురేష్ రైనా

మూడేళ్ళుగా గిల్ వన్డేల్లో నిలకడగా రాణిస్తున్నాడు. 58 యావరేజ్ తో ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ లో మూడో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇప్పటివరకు 47 వన్డేల్లో 2328 పరుగులు చేసిన గిల్ ఖాతాలో 6 సెంచరీలు.. 13 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. న్యూజిలాండ్ పై వన్డేల్లో డబుల్ సెంచరీ బాదాడు. టీ20, టెస్ట్ ఫార్మాట్ లో విఫలమైనా.. వన్డేల్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. మరోవైపు జైశ్వాల్ టెస్టుల్లో సూపర్ ఫామ్ట్ తో తొలిసారి వన్డే జట్టులో స్థానం దక్కించుకున్నాడు          

ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్సర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, అర్షదీప్ సింగ్.