IPL 2025: ఆ జట్టు కాన్ఫిడెన్స్ పెరిగింది.. ఐపీఎల్ 2025 గెలుస్తుంది: టీమిండియా దిగ్గజ క్రికెటర్

IPL 2025: ఆ జట్టు కాన్ఫిడెన్స్ పెరిగింది.. ఐపీఎల్ 2025 గెలుస్తుంది: టీమిండియా దిగ్గజ క్రికెటర్

ఐపీఎల్ 2025 సక్సెస్ ఫుల్ గా దూసుకెల్తూ క్రికెట్ అభిమానులకు ఎంటర్ మెంట్ ఇస్తోంది. దాదాపు నెల రోజుల పాటు జరుగుతూ వస్తున్న ఈ సీజన్ ఐపీఎల్ లో ఫస్ట్ హాఫ్ ముగిసింది. అని జట్లు సగం మ్యాచ్ లు ఆడేశాయి. ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, గుజరాత్ 10 పాయింట్లతో టాప్-3లో ఉండగా.. లక్నో సూపర్ జయింట్స్ 8 పాయింట్లతో ప్లే ఆఫ్ రేస్ లో ఉంది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్ పాయింట్ల పట్టికలో చివర్లో ఉన్నాయి. అయితే ఐపీఎల్ లో చివరి వరకు ఏ జట్టు ప్లే ఆఫ్ కు వెళ్తుందో చెప్పడం కష్టం. 

టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాత్రమే ఏకంగా ఐపీఎల్ ట్రోఫీ ఏ జట్టు గెలుస్తుందో జోస్యం చెప్పాడు. ఐపీఎల్ 2025 ట్రోఫీని పంజాబ్ కింగ్స్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. హర్భజన్ తన యూ ట్యూబ్ ఛానల్ లో మాట్లాడుతూ.. "కోల్‌కతా నైట్ రైడర్స్‌పై పంజాబ్ కింగ్స్ సాధించిన విజయం వారికి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఐపీఎల్ 2025 ట్రోఫీని పంజాబ్ కింగ్స్ గెలుచుకుంటుంది. ఒక జట్టు ఓడిపోయే మ్యాచ్ లో గెలిచినప్పుడు ఆ కాన్ఫిడెన్స్ చాలా బలాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం పంజాబ్ బాగా ఆడుతుందని భావిస్తున్నాను". అని ఈ మాజీ స్పిన్నర్ తెలిపాడు. 

ప్రస్తుతం పంజాబ్ కింగ్స్ ఆడిన 7 మ్యాచ్ ల్లో 5 విజయాలు సాధించి 10 పాయింట్లతో టేబుల్ టాప్ 3 లో కొనసాగుతుంది. శ్రేయాస్ అయ్యర్ సారధ్యంలోని పంజాబ్ కింగ్స్.. ఈ సారి చాలా బలంగా కనిపిస్తుంది. గత సీజన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ కు ఐపీఎల్ టైటిల్ అందించిన అయ్యర్ పై ఈ సారి పంజాబ్ భారీగానే అసలు పెట్టుకుంది. మరో 7 మ్యాచ్ ల్లో 3 గెలిచినా పంజాబ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధిస్తుంది.