
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తన జోస్యంతో మాట నిలబెట్టుకున్నాడు. ఆదివారం(ఫిబ్రవరి) పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు విరాట్ కోహ్లీ సెంచరీ కొడతాడని బల్లగుద్ది చెప్పడం విశేషం. కావాలంటే తన మాటలు రాసిపెట్టుకోవాలని శపథం చేశారు. అంతేకాదు, విరాట్ సెంచరీ మరుక్షణం తన భాంగ్రా స్టెప్పులు చూస్తారని పలికారు. పేలవ ఫామ్ లో ఉన్న కోహ్లీ సెంచరీని ఎవరూ ఊహించలేదు. కోహ్లీపై ఉన్న అభిమానంతో హర్భజన్ అలా చెప్పి ఉండొచ్చని ఈ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ హర్భజన్ చెప్పిందే జరిగింది.
రోహిత్ శర్మ ఔటైన తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కోహ్లీ.. మొదట్లో పరుగులు చేయడానికి ఇబ్బంది పడ్డాడు. ఆచితూచి ఆడుతూ సింగిల్స్ పైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు. మరో ఎండ్ లో గిల్ వేగంగా ఆడడంతో కోహ్లీపై ఒత్తిడి తగ్గింది. 62 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ .. అదే జోరును కొనసాగిస్తూ ఇన్నింగ్స్ చివరి వరకు నిలబడ్డాడు. భారత విజయానికి మరో రెండు పరుగులు కావాల్సిన దశలో కోహ్లీ ఫోర్ కొట్టి సెంచరీని పూర్తి చేసుకున్నాడు. 2023లో న్యూజిలాండ్ పై వన్డే వరల్డ్ కప్ లో సెంచరీ కొట్టిన విరాట్.. మరో 14 నెలల తర్వాత వన్డేల్లో సెంచరీని నమోదు చేశాడు. కోహ్లీ ఇన్నింగ్స్ లో 7 ఫోర్లున్నాయి.
Also Read:-ఛాంపియన్స్ ట్రోఫీలో విదేశీయులను కిడ్నాప్ చేసే కుట్ర.. పాక్ ఇంటెలిజెన్స్ హెచ్చరికలు
ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో ఆదివారం (ఫిబ్రవరి ) జరిగిన మ్యాచ్ లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పెద్దగా కష్టపడకుండానే రోహిత్ సేన అలవోక విజయాన్ని అందుకుంది. టాస్ నెగ్గిన పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 241 రన్స్‌కు ఆలౌటైంది. సౌద్ షకీల్ (76 బాల్స్‌లో 5 ఫోర్లతో 62), మహ్మద్ రిజ్వాన్ (77 బాల్స్‌లో 3 ఫోర్లతో 46), ఖుష్దిల్ షా (39 బాల్స్‌లో 2 సిక్సర్లతో 38) రాణించారు.అనంతరం కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ (67 బాల్స్‌లో 5 ఫోర్లు, 1 సిక్స్‌తో 56) మెరుపులతో ఇండియా 42.3 ఓవర్లలోనే 244/4 స్కోరు చేసి గెలిచింది.
హర్భజన్ ఏం చెప్పాడంటే..?
"నేనిప్పుడు ఒక పెద్ద అంచనా వేయబోతున్నాను. పాకిస్తాన్ పై విరాట్ కోహ్లీ 100 పరుగులు చేస్తే ఎలా ఉంటుంది..? అవును నేనంటోంది నిజమే. గత 4 నెలల్లో అతను ఎలా రాణించాడనేది ప్రజలకు, అభిమానులకు అనవసరం. ఆ స్కోర్లు ఎవరికీ గుర్తుండవు. రేపు పాకిస్థాన్‌పై 100 పరుగులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. దేశం మొత్తం అతని వెనుకే ఉంది. విరాట్ 100 పరుగులు చేస్తాడని నేను గట్టిగా నమ్ముతున్నాను. అది జరిగిన మరు నిమిషం నేను భాంగ్రా చేయబోతున్నాను.." అని హర్భజన్ అన్నారు.
జట్టులో తన పాత్రేంటో కోహ్లీకి బాగా తెలుసని, అతను తిరిగి ఫామ్‌లోకి రావాలని హర్భజన్ అన్నారు. భారత స్టార్ ఫామ్‌లోకి రావడానికి ఇదే సరైన సమయమని తెలిపారు. కోహ్లీ శనివారం ప్రాక్టీస్ సెషన్‌కు 90 నిమిషాల ముందుగానే వచ్చి చెమటోడ్చిన విషయాన్ని హర్భజన్ ప్రత్యేకంగా ప్రస్తావించారు.