అయోధ్య రామునికి బదులు మరో వీడియో.. భారత క్రికెటర్‪పై నెట్టింట ట్రోల్స్

అయోధ్య రామునికి బదులు మరో వీడియో.. భారత క్రికెటర్‪పై నెట్టింట ట్రోల్స్

యావత్ భారత దేశం ఎంతోకాలంగా ఎదరుచూస్తున్న సమయం ఎట్టకేలకు సంపూర్ణమైంది. అయోధ్యలోని రామ జన్మభూమిలో బాల రాముడు కొలువుదీరాడు. భార‌త కాల‌మానం ప్రకారం సోమవారం (జనవరి 22) మ‌ధ్యాహ్నం 12.29 నిమిషాల‌ సమయంలో ఈ మహోత్తర కార్యక్రమం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ జరిగిన వెంటనే భారత వైమానిక దళానికి చెందిన హెలికాప్టర్లు ఆలయంపై పూల వర్షం కురిపించాయి. ఇలాంటి సమయాన భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ నెట్టింట విమర్శలు ఎదుర్కొంటున్నారు.

ఏం జరిగిందంటే..?

రామమందిర ప్రాణ ప్రతిష్ఠ వేడుకకు ఆహ్వానం అందుకున్న అతికొద్ది మంది క్రికెటర్లలో భజ్జీ ఒకరు. సోమవారం అయోధ్యలోని రామమందిరానికి తన వంతుగా విషెష్ తెలిపేందుకు భజ్జీ.. వీడియో పోస్ట్ చేయాలనుకున్నారు. అయితే, తొందరపాటులో రామమందిర వీడియోకు బదులుగా కోల్‌కతాలోని దుర్గాపూజ పండల్‌ వీడియో పోస్ట్ చేశారు. దీంతో నెటిజెన్స్.. భజ్జీని ట్రోల్ చేస్తూ సోషల్ మీడియాలో  పోస్టులు పెడుతున్నారు. దుర్గాపూజ పండల్‌ ఇతివృత్తం రామ‌మందిరాన్ని ఆధారం చేసుకున్నదే అయినప్పటికీ అతన్ని వదిలిపెట్టడం లేదు.

మిస్టర్ టర్బనేటర్

'మిస్టర్ టర్బనేటర్ ఇది కోల్‌కతా..' ఆ దేవుని దయవల్ల మీరు భారత జట్టు కెప్టెన్ కాలేదు. లేదంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను మీ సహచరులని తప్పుగా పొరబడేవారు.. అంటూ రకరకాల కామెంట్లతో ట్రోల్ చేస్తున్నారు.