
ఒక్క నెలలో ఎంత మార్పు. ట్రోల్స్ చేసిన వారే అభినందిస్తున్నారు. విమర్శించిన వారే ప్రశంసిస్తున్నారు. తిట్టిన వారే జేజేలు కొడుతున్నారు. ఎక్కడైతే పోగొట్టుకున్నాడో అక్కడే వెతుక్కున్నాడు. ఇదంతా టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గురించి చెబుతున్న మాటలు. ఐపీఎల్ 2024 లో రోహిత్ శర్మను తొలగించి అతని స్థానంలో హార్దిక్ చేయడం రోహిత్ ఫ్యాన్స్ కు నచ్చలేదు. దీంతో పాండ్యను వ్యక్తిగతంగా దూషించారు. గ్రౌండ్ లో అతన్ని బహిరంగంగానే తిట్టారు. దీంతో పాండ్య ఒత్తిడిలో పడిపోయాడు. ఈ కారణంగానే కెప్టెన్సీతో పాటు ప్లేయర్ గాను విఫలమయ్యాడు.
వరల్డ్ కప్ లోనూ పాండ్యపై ఎవరికీ పెద్దగా అంచానాలు లేవు. అయితే పాండ్య ఆటతోనే అందరికీ సమాధానం చెప్పాడు. వరల్డ్ కప్ 2024 లో ఆల్ రౌండర్ గా అదరగొట్టి భారత విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వరల్డ్ కప్ ఫైనల్లో చివర్లో మ్యాచ్ ను మలుపుతిప్పాడు. విక్టరీ పరేడ్ లో భాగంగా గురువారం (జూలై 4)ముంబైలోని వాంఖడే లో జరిగిన సెలెబ్రేషన్స్ గ్రాండ్ గా జరిగాయి. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఫైనల్లో హార్దిక్ పాండ్య వేసిన చివరి ఓవర్ గురించి ప్రస్తావించాడు. ఫైనల్లో చివరి ఓవర్ ఎంతో కీలకమని ఈ ఓవర్ ను హార్దిక్ ఒత్తిడిని తట్టుకొని పాండ్య భారత్ కు అందించాడని చెప్పాడు.
ఈ సమయంలో ఒక్కసారిగా ప్రేక్షకులు హార్దిక్, హార్దిక్ అనే నినాదాలు చేశారు. ప్రేక్షకుల వైపు చూస్తూ పాండ్య సైతం ఆశ్చర్యపోయాడు. సంతోషంతో స్టేడియంలోని అభిమానులకు నవ్వుతూ తన సంతోషాన్ని చేశాడు. వరల్డ్ కప్ ఫైనల్లో ఓడిపోయే దశలో క్లాసన్ వికెట్ పడగొట్టి మ్యాచ్ ను టర్న్ చేశాడు. ఇక చివరి ఓవర్లో మిల్లర్ లాంటి బ్యాటర్ ను కంట్రోల్ చేసి 16 పరుగులను డిఫెండ్ చేశాడు. భారత్ విశ్వవిజేతగా నిలిచిన తర్వాత ఎమోషనల్ కంట్రోల్ చేసుకోలేక చిన్న పిల్లాడిలా గ్రౌండ్ లో కంట తడి పెట్టుకున్నాడు. ఐపీఎల్ సమయంలో విమర్శలు ఎదుర్కొన్న పాండ్యపై ప్రస్తుతం దేశమంతా ప్రశంసలు కురుస్తున్నాయి. ఇదే అసలైన సక్సెస్ అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
'HARDIK HARDIK' CHANTS AT WANKHEDE.
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 4, 2024
- From getting booed to now getting cheered. 🇮🇳pic.twitter.com/bU9KF1ncMH