భారత క్రికెట్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా అత్యంత విలాసవంతమైన, సౌకర్యవంతమైన లగ్జరీ కారు కొనుగోలు చేశాడు. జపనీస్ ప్రీమియం కార్ల తయారీ సంస్థ లెక్సస్ కంపెనీకి చెందిన LM350h MPVని సొంతం చేసుకున్నాడు. ఈ కారు ఎక్స్-షోరూమ్ ధర దాదాపు రూ. 2.5 కోట్లు(ముంబై).
ఈ కారు కొనేందుకు ధనవంతులు ఎగబడుతున్నారు. ఎందుకంటే ఇందులోని లగ్జరీ ఫీచర్లు ఆ రేంజ్‌లో ఉన్నాయి. లెక్సస్ ఎల్ఎం 350హెచ్ లగ్జరీ ఎంపీవీ లేటెస్ట్ వర్షన్ ఈ ఏడాది మార్చిలో భారత మార్కెట్లో లాంచ్ అయింది. 7-సీటర్ లేదా 4-సీటర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులో పాండ్యా 4 సీటర్ మోడల్ కొనుగోలు చేశాడు.
4 సీటర్ మోడల్‌లో క్యాబిన్ స్పేస్ చాలా విశాలంగా ఉంటుంది. ఇది ముందు, వెనుక కూర్చునే ప్రయాణీకుల మధ్య డివిజిన్ ఉండేలా చేస్తుంది. కారు లోపల ఎయిర్ క్రాఫ్ట్ లాంటి రెక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్, కుషన్ తరహా హెడ్ రెస్ట్, 48 అంగుళాల టీవీ, ఫ్రిజ్ ఉన్నాయి. అంతేకాదు ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో కూడిన AC, లాంగ్ స్లైడ్ రైల్‌తో పవర్ సీట్, వివిధ సీట్ మోడ్‌లతో టిల్ట్-అప్ సీటు వంటి ఇతర ఫీచర్లు ఉన్నాయి. ఇక భద్రత పరంగా లేన్ ట్రాకింగ్ అలర్ట్, లేన్ డిపార్చర్ అలర్ట్, డైనమిక్ రాడార్ క్రూయిజ్ కంట్రోల్ వంటి ADAS ఫీచర్లను జోడించారు.
మొదటి భారత క్రికెటర్
లెక్సస్ LM350h MPVని సొంతం చేసుకున్న మొదటి భారత క్రికెటర్ పాండ్యా. అయితే, అంబానీ కుటుంబం, రణబీర్ కపూర్‌లు ఇప్పటికే ఈ కారు వాడుతున్నారు.
పాండ్యా వద్దనున్న టాప్ 5 లగ్జరీ కార్లు
- 1. రోల్స్ రాయిస్ ఫాంటమ్: రూ. 6.22 కోట్లు
- 2. లంబోర్ఘిని హురాకాన్ EVO: రూ. 3.4 కోట్లు
- 3. రేంజ్ రోవర్ వోగ్: రూ. 4 కోట్లు
- 4. Mercedes-AMG G 63: రూ. 2.28 కోట్లు
- 5. పోర్స్చే కయెన్: రూ. 1.9 కోట్లు