టీమిండియా క్రికెటర్ హార్దిక్ పాండ్యా సోదరుడు (సవతి తల్లి కొడుకు ) వైభవ్ పాండ్యాను ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వైభవ్ పాండ్యా.. కృనాల్, హార్దిక్ పాండ్యాలతో కలిసి 2021లో పాలిమర్ బిజినెస్ పెట్టారు. అందులో వైభవ్ పాండ్యాకు 20 శాతం వాటా ఉంది. అయితే వైభవ్ పాండ్యా తన పార్టనర్స్ కు తెలియకుండా ఇదే తరహా బిజినెస్ పెట్టాడు. అయితే కొత్త బిజినెస్ కోసం పాత బిజినెస్ నుంచి రూ. 4. 3 కోట్ల నిధులు మళ్లించాడు.
దీంతో హార్దిక్, కృనాల్‌లకు దాదాపు మూడు కోట్ల నష్టం నష్టం వాటిల్లిందట. తమ సంతకాన్ని ఫోర్జరీ చేసి మోసం చేశాడని వైభవ్ పాండ్యాపై ఆరోపణలు వచ్చాయి. దీంతో అతనిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదయ్యాయి. అయితే దీనిపై పాండ్యా సోదరులు ఇంతవరకు స్పందించలేదు. ప్రస్తుతం వీరిద్దరూ ఐపీఎల్ లో బిజీగా ఉన్నారు. హార్దిక్ పాండ్యా ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్ గా ఉండగా.. కృనాల్ లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ లో అద్భుతంగా రాణిస్తున్నాడు.