IPL 2025: చెన్నైతో మ్యాచ్‌కు కెప్టెన్‌గా సూర్య.. కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్య

IPL 2025: చెన్నైతో మ్యాచ్‌కు కెప్టెన్‌గా సూర్య.. కన్ఫర్మ్ చేసిన హార్దిక్ పాండ్య

ఐపీఎల్ తొలి మ్యాచ్ కు హార్దిక్ పాండ్య దూరం కావడంతో ముంబై ఇండియన్స్ జట్టుకు ఎవరు కెప్టెన్ అనే విషయంలో సస్పెన్స్ వీడింది. సీజన్ లో ముంబై ఇండియన్స్ ఆడబోయే తొలి మ్యాచ్ కు స్టార్ బ్యాటర్ సూర్య కుమార్ యాదవ్ జట్టును నడిపించనున్నాడు. చెన్నైతో జరగబోయే తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ సూర్య అంటూ హార్దిక్ పాండ్య అధికారికంగా ధృవీకరించాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో హార్దిక్ పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో తొలి మ్యాచ్ కు ముంబై కెప్టెన్ ఎవరనే ప్రశ్న హార్దిక్ పాండ్యను అడిగారు. దానికి పాండ్య స్పందిస్తూ సూర్య అని చెప్పాడు.

హార్దిక్ తో పాటు గాయం కారణంగా జస్‌ప్రీత్ బుమ్రా కూడా తొలి మ్యాచ్‌కు దూరం కానున్నాడు. దీంతో ఈ ఇద్దరు స్టార్ ప్లేయర్లు లేకుండానే ముంబై ఆదివారం (మార్చి 23) చెపాక్ వేదికగా పటిష్టమైన చెన్నై సూపర్ కింగ్స్ తో తలబడబోతుంది. గత ఎడిషన్ ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా వరుసగా మూడు సార్లు స్లో ఓవరేట్‌కు గురయ్యాడు. అంటే, నిర్ణీత సమయంలోగా ఓవర్లు పూర్తి చేయలేకపోయాడు. దాంతో అతనిపై ఓ మ్యాచ్ ఆడకుండా నిషేధం పడింది. ఈ సీజన్ లో పాండ్యను ముంబై ఇండియన్స్ హార్దిక్ పాండ్యను, సూర్య కుమార్ యాదవ్ ఇద్దరినీ కూడా రూ. 16.3 కోట్లకు ముంబై రిటైన్ చేసుకుంది.

ALSO READ :" IPL 2025: బలహీనంగా ముంబై.. హార్దిక్, బుమ్రా లేకుండానే చెన్నైతో మ్యాచ్

గత సీజన్ లో హార్దిక్ నాయకత్వంలోని ముంబై ఇండియన్స్ ఘోర ప్రదర్శన చేసింది. 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగు మ్యాచ్‌ల్లోనే గెలిచి 8 పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. ఈ సీజన్ లో తొలి రెండు మ్యాచ్ లు సొంతగడ్డపై ఆడే అవకాశం లేకుండా పోయింది. తొలి మ్యాచ్ లో చెన్నై తో.. మార్చి 29న గుజరాత్ టైటాన్స్ అహ్మదాబాద్‌ వేదికగా మ్యాచ్ లు ఆడనుంది. మార్చి 31న వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్ తన తొలి హోమ్ మ్యాచ్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ తో ఆడనుంది. ఆ తర్వాత ఏప్రిల్ 4న లక్నో సూపర్ జెయింట్స్ తో.. ఏప్రిల్ 7న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ లు ఆడాల్సి ఉంది.