
ముంబై: టీమిండియా ఆల్‌రౌండర్ పాండ్యాకు చెందిన ఖరీదైన వాచ్‌లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వస్తున్న వార్తలపై అతడు స్పందించాడు. దేశ చట్టాలను, ప్రభుత్వ ఏజెన్సీలను తాను గౌరవిస్తారనని పాండ్యా అన్నాడు. ఆ వాచ్‌ల విలువ రూ.5 కోట్లని సోషల్ మీడియాలో రూమర్లు ప్రచారం చేస్తున్నారని.. కానీ వాటి ఖరీదు రూ.1.5 కోట్లు మాత్రమేనని చెప్పాడు. ‘ముంబై ఎయిర్‌పోర్టు కస్టమ్స్ కౌంటర్ దగ్గరకు నేనే స్వచ్ఛంగా వెళ్లా. నాతో తీసుకొచ్చిన వస్తువులకు కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకే వెళ్లా. ఈ ఘటనకు సంబంధించిన నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది సరికాదు. దుబాయ్‌లో నేను కొన్న ఐటమ్స్‌కు కస్టమ్స్ డ్యూటీ కట్టేందుకు రెడీగా ఉన్నా. ఇందులో భాగంగానే విక్రయించిన డాక్యుమెంట్లు ఇవ్వాల్సిందిగా కస్టమ్స్ అధికారులు కోరారు. వాటిని నేను వెంటనే సమర్పించా. వీటిని అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ వస్తువుల విలువ కట్టడం పూర్తయ్యాక.. ఎంత పన్ను కట్టమంటే అంత చెల్లిస్తా’ అని పాండ్యా ట్వీట్ చేశాడు.
— hardik pandya (@hardikpandya7) November 16, 2021