IND Vs PAK: ఆడింది చాలు పో.. పో.. బాబర్‌కు హార్దిక్ బై బై సెండాఫ్

IND Vs PAK: ఆడింది చాలు పో.. పో.. బాబర్‌కు హార్దిక్ బై బై సెండాఫ్

దుబాయి వేదికగా పాకిస్థాన్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ మ్యాచ్ లో టీమిండియా కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుంది. తొలి 10 ఓవర్లలో అద్భుతంగా ఆడిన పాకిస్థాన్.. ఆ తర్వాత ఆత్మ రక్షణలో పడిపోయింది. ఆచితూచి బ్యాటింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. ప్రస్తుతం 26 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 107 పరుగులు చేసింది. క్రీజ్ లో సౌద్ షకీల్(37), కెప్టెన్ మహమ్మద్ రిజ్వాన్ (31) ఉన్నారు. ఇదిలాఉంటే, ఈ మ్యాచ్ లో బాబర్ అజామ్ కు హార్దిక్ పాండ్య సెలెబ్రేషన్ వైరల్ గా మారింది. 

ఇన్నింగ్స్ 9 ఓవర్ తొలి బంతికి హార్దిక్ బౌలింగ్ లో చూడచక్కని డ్రైవ్ చేసిన బాబర్ రెండో బంతికి ఔటయ్యాడు. పాండ్య వేసిన ఔట్ సైడ్ ఆఫ్ స్టంప్ బంతిని డ్రైవ్ చేయాలని బాబర్.. వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. దీంతో హార్దిక్ బాబర్ వైపు చూస్తూ బై బై అని సైగ చేశాడు. హార్దిక్ సెలెబ్రేషన్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వికెట్ తీసినప్పుడు పాండ్య ఇలాంటి సెలెబ్రేషన్స్ చేసుకోవడం సాధారణమే. అయితే పాకిస్థాన్ పై.. అది కూడా బాబర్ అజామ్ వికెట్ కావడంతో ఫ్యాన్స్ కూడా ఈ వికెట్ ను తెగ ఎంజాయ్ చేశారు. 

ALSO READ | IND Vs PAK: షమీ చెత్త రికార్డ్.. తొలి ఓవర్ లోనే 11 బంతులు

8 ఓవర్ల వరకు వికెట్ పడకుండా కాపాడకుంటూ వచ్చిన పాక్.. ఆ మరుసటి రెండ్ ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది. 10 ఓవర్లు ముగిసేసరికి 52/2. ఈ దశలో పాకిస్థాన్ ను ఆదుకునే బాధ్యత సౌద్ షకీల్, రిజ్వాన్ తీసుకున్నారు. మూడో వికెట్ కు 100 బంతుల్లో 60 పరుగులు చేసి పరిస్థితిని చక్కదిద్దారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్యకు ఒక వికెట్ దక్కింది.