ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక పాండ్య ప్రవర్తనపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గెలుపోటములను పక్కన పెడితే పాండ్య వైఖరి ఎవరికీ నచ్చడం లేదు. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ తొలి మ్యాచ్ నుంచే ట్రోలింగ్ కు గురవుతున్నాడు. అయితే దీనికి తగ్గట్లు పాండ్య తన ప్రవర్తన మారదన్నట్టు ఎవరినీ లెక్క చేయడం లేదు. గుజరాత్ జరిగిన తొలి మ్యాచ్ లో రోహిత్ శర్మను బౌండరీ వద్దకు ఫీల్డింగ్ కు పంపించి ఫ్యాన్స్ ఆగ్రహానికి గురైన హార్దిక్.. తాజాగా సీనియర్ ప్లేయర్లు పొలార్డ్, లసిత్ మలింగాలను అగౌరపరిచాడు.
Also Read: ఢిల్లీ జట్టులో చేరిన సౌతాఫ్రికా స్టార్ బౌలర్
ఉప్పల్ వేదికగా నిన్న (మార్చి 27) సన్ రైజర్స్ తో జరిగిన పోరులో ముంబై ఇండియన్స్ 31 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ సమయంలో బ్యాటింగ్ దిగడానికి ముందు పాండ్య కాస్త ఒత్తిడికి లోనైనట్లు స్పష్టంగా అర్ధమవుతుంది. భారీ స్కోర్ ఛేజింగ్ కావడం వలన ఆ ఏం చేస్తున్నాడో పాండ్యకు అర్ధం కాలేదు. బ్యాటింగ్ దిగడానికి సిద్ధమైన పాండ్య.. డగౌట్‌లో కూర్చున్న మలింగా, పొలార్డ్‌లలో దగ్గరకు వెళ్లి కుర్చీ కావాలని అడిగాడు. పొలార్డ్ లేచి కుర్చీ ఇవ్వబోతుంటే.. మలింగా పొలార్డ్‌ను ఆపి, తన కుర్చీలో కూర్చోవాలని వెళ్ళిపోయాడు.
సీనియర్ ప్లేయర్లుకు కనీస మర్యాద ఇవ్వకుండా హార్దిక్ పాండ్యను నెటిజన్స్ మండిపడుతున్నారు. పాండ్య నువ్వు ఇక మారవా అని కామెంట్స్ చేస్తున్నారు. మలింగా, పొలార్డ్ ఇద్దరూ కూడా ముంబై ఇండియన్స్ తరపున దశాబ్దకాలంగా ఆడారు. గతంలో ముంబై ఇండియన్స్ తరపున ఆడారు. ముంబై జట్టు విజయాల్లో వీరిద్దరూ కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం మలింగా బౌలింగ్ కోచ్ గా.. పోలార్డ్ బ్యాటింగ్ కోచ్ గా పని చేస్తున్నారు.
ALL is NOT well between Hardik Pandya and Lasith Malinga in MI Camp.
— 🕊️ (@retiredMIfans) March 28, 2024
Another video went viral when Hardik refused to shake hands with Malinga after the match.#SRHvsMi #HardikPandya #RohitSharma𓃵
pic.twitter.com/t6dyqNwBYI