ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యాకు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు భారీ ఫైన్ పడింది. ఏప్రిల్ 18వ తేదీ గురువారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో మంబై జట్టు స్లో ఓవర్‌రేట్‌ను కొనసాగించింది. దీంతో హార్ధిక్ పాండ్యాకు రూ. 12 లక్షల జరిమానా పడింది. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా విధించినట్టు బీసీసీఐ ప్రకటించింది. స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యాకు జరిమానా విధించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
మళ్లీ ఇదే రిపీటైతే కెప్టెన్ హార్దిక్‌తో పాటు జట్టు సభ్యులందరూ జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఇక మూడోసారి కూడా స్లో ఓవర్ రేట్ రిపీట్ అయితే జరిమానాతో పాటుగా వేటు కూడా పడుతుంది. ఇక ఐపీఎల్ లో తరుచూ స్లో ఓవర్ రేట్ నమోదవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్, గుజరాత్ కెప్టెన్ శుబ్‌మన్ గిల్, రాజస్థాన్ కెప్టెన్ సంజు శాంసన్‌లకు జరిమానా పడింది. నిర్ణీత సమయంలోపు పూర్తి ఓవర్లు పూర్తి చేయకపోతే స్లో ఓవర్‌రేట్ కారణంగా జరిమానా విధిస్తారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఐపీఎల్ లో ముంబై మూడో విజయాన్ని అందుకుంది. 9 రన్స్ స్వల్ప తేడాతో పంజాబ్ కింగ్స్‌ను ఓడించింది. టాస్ ఓడిన ముంబై 20 ఓవర్లలో 192/7 స్కోరు చేసింది. రోహిత్ శర్మ (36), తిలక్ వర్మ (34 నాటౌట్) ఫర్వాలేదనిపించారు. తర్వాత పంజాబ్ 19.1 ఓవర్లలో 183 రన్స్‌కు ఆలౌటైంది. అశుతోష్ సింగ్ (28 బాల్స్‌లో 2 ఫోర్లు, 7 సిక్స్‌లతో 61), శశాంక్ సింగ్ (25 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 41) గెలిపించినంత పని చేశారు. కానీ చివర్లో ముంబై బౌలర్లు పట్టు బిగించడంతో పంజాబ్ చితికిలపడింది. బుమ్రాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.