తన నోటిదురుసు కారణంగా తరచూ వార్తల్లో నిలిచే భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మరోసారి అలాంటి వివాదంలో చిక్కుకున్నాడు. ఐపీఎల్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ సెట్‌లో పాల్గొన్న పాండ్యా.. అక్కడున్న సిబ్బందిపై నోరు పారేసుకున్నాడు. తనకు వడ్డించిన ఆహారం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ సెట్‌లో ఉన్న వ్యక్తులపై చిందులు తొక్కాడు. ఆ దృశ్యాలను తోటి వ్యక్తులు తమ మొబైల్‌లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అతని లీలలు బయటకొచ్చాయి.
ఏం జరిగిందంటే..?
వన్డే ప్రపంచ కప్ 2023 సమయంలో చీలమండ గాయం బారిన పడిన పాండ్యా.. టోర్నీ మధ్యలోనే వైదొలిగాడు. అప్పటినుంచి ఆటకు దూరంగా ఉంటూ, తన సోదరుడు కృనాల్, సహచరుడు ఇషాన్ కిషన్(ముంబై ఇండియన్స్)తో కలిసి కఠిన శిక్షణ తీసుకుంటున్నాడు. ఫిట్‌నెస్‌ను తిరిగి పొందడానికి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకుంటూ డైట్ మెయింటెయిన్ చేస్తున్నాడు. ఈ క్రమంలో ఐపీఎల్ యాడ్ ఫిల్మ్ షూటింగ్ సెట్స్‌లో పాల్గొనగా.. అతనికి సాంప్రదాయ గుజరాతీ వంటకాలను వడ్డించారు. ఆ ఆహారం పట్ల అతను అసంతృప్తి వ్యక్తం చేశాడు.
'నా డైట్ గురుంచి తెలియదా..! నా సిబ్బందిని అడిగి తెలుసుకో..' అంటూ సెట్‌లో ఉన్న వ్యక్తులలో పాండ్యా గట్టిగా అరిచాడు. ఆ దృశ్యాలను అక్కడున్న తోటి వ్యక్తులు తమ మొబైల్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్‌గా మారాయి. పాండ్యాకు వడ్డించిన భోజనం ధోక్లా, జిలేబీ, ఫఫ్డా అని తెలుస్తోంది. ఇవి ప్రొఫెషనల్ అథ్లెట్ తినకూడనివని సమాచారం. ఈ క్రమంలోనే అతను నోరుపారేసుకున్నాడని యాడ్ షూటింగ్ సెట్స్‌లో ఉన్న మరికొందరు చెప్పినట్లు కథనాలు వస్తున్నాయి.
No cheat meals for Hardik Pandya in this leaked clip from the Star Sports IPL film shoot. pic.twitter.com/7Td02ecl8m
— Mufaddal Vohra (@mufaddal_vohra) February 23, 2024
ముంబై ఇండియన్స్ కెప్టెన్
గడిచిన రెండు సీజన్లలో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్‌గా ఉన్న పాండ్యా.. 2024 సీజన్‌లో ముంబై ఇండియన్స్ జట్టును నడిపించనున్నాడు. రోహిత్ శర్మ స్వేచ్ఛగా బ్యాటింగ్ చేయాలన్న ఉద్దేశ్యంతో ముంబై యాజమాన్యం.. కెప్టెన్సీ బాధ్యతలను పాండ్యాకు అప్పగించింది.
మార్చి 22 నుంచి ఐపీఎల్
కాగా, ఐపీఎల్ -17వ సీజన్ మార్చి 22 నుండి ప్రారంభం కానుంది. ఈ ఏడాది మార్చి-ఏప్రిల్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీసీసీఐ మొదటి 21 రోజుల షెడ్యూల్ మాత్రమే విడుదల చేసింది. ఈ మ్యాచ్‌లు మార్చి 22 నుండి ఏప్రిల్ 7 వరకు జరుగుతాయి. మిగిలిన షెడ్యూల్‌ను భారత ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల తేదీలను వెల్లడించిన తర్వాత ప్రకటించనుంది.
మొదటి 21 మ్యాచ్‌ల షెడ్యూల్
- మార్చి 22 : చెన్నై వర్సెస్ బెంగళూరు (చెన్నై)
- మార్చి 23 : పంజాబ్ వర్సెస్ ఢిల్లీ (మొహాలీ)
- మార్చి 23: కోల్‌కతా వర్సెస్ హైదరాబాద్ (కోల్‌కతా)
- మార్చి 24 : రాజస్తాన్ వర్సెస్ లక్నో (జైపూర్)
- మార్చి 24 : గుజరాత్ వర్సెస్ ముంబై (అహ్మదాబాద్)
- మార్చి 25 : బెంగళూరు వర్సెస్ పంజాబ్ (బెంగళూరు)
- మార్చి 26 : చెన్నై వర్సెస్ గుజరాత్ (చెన్నై)
- మార్చి 27 : హైదరాబాద్ వర్సెస్ ముంబై (హైదరాబాద్)
- మార్చి 28 : రాజస్తాన్ వర్సెస్ ఢిల్లీ (జైపూర్)
- మార్చి 29 : బెంగళూరు వర్సెస్ కోల్‌కతా (బెంగళూరు)
- మార్చి 30 : లక్నో వర్సెస్ పంజాబ్ (లక్నో)
- మార్చి 31: గుజరాత్ వర్సెస్ హైదరాబాద్ (అహ్మదాబాద్)
- మార్చి 31 : ఢిల్లీ వర్సెస్ చెన్నై (వైజాగ్)
- ఏప్రిల్ 01 : ముంబై వర్సెస్ రాజస్తాన్ (ముంబై)
- ఏప్రిల్ 02 : బెంగళూరు వర్సెస్ లక్నో (బెంగళూరు)
- ఏప్రిల్ 03 : ఢిల్లీ వర్సెస్ కోల్‌కతా (వైజాగ్)
- ఏప్రిల్ 04 : గుజరాత్ వర్సెస్ పంజాబ్ (అహ్మదాబాద్)
- ఏప్రిల్ 05 : హైదరాబాద్ వర్సెస్ చెన్నై (హైదరాబాద్)
- ఏప్రిల్ 06 : రాజస్తాన్ వర్సెస్ బెంగళూరు ( జైపూర్)
- ఏప్రిల్ 07 : ముంబై వర్సెస్ ఢిల్లీ (ముంబై)
- ఏప్రిల్ 07 : లక్నో వర్సెస్ గుజరాత్ (లక్నో)