స్వదేశంలో వరల్డ్ కప్ ఉందని సంతోషించే లోపు ఒకొక్క ప్లేయర్ గాయాల భారిన పడడం ఇప్పుడు టీమిండియాను ఆందోళనకు గురి చేస్తుంది. స్టార్ ఓపెనర్ శుభమన్ గిల్ డెంగ్యూ జ్వరంతో ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఆదివారం ఆస్ట్రేలియాతో జరగబోయే ప్రారంభ మ్యాచుకు దాదాపుగా అందుబాటులో ఉండడనే అభిప్రాయలు వ్యక్తం అవుతున్నాయి. ఇక తాజాగా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య ప్రాక్టీస్ చేస్తూ గాయపడ్డాడు.
నిన్న నెట్స్ లో హార్దిక్ ప్రాక్టీస్ చేస్తుండగా గాయమైనట్టు సమాచారం. సిరాజ్ వేసిన ఓ బౌన్సర్, హార్ధిక్ పాండ్యా వేలికి బలంగా తగిలింది. దీంతో అప్పటికప్పుడూ బ్యాటింగ్ కొనసాగించకుండానే వెళ్ళిపోయాడు. ఒకవేళ మ్యాచ్ సమయానికి పాండ్య కోలుకోకపోతే భారత్ కి గట్టి ఎదురు దెబ్బే అని చెప్పాలి. హార్దిక్ లాంటి ఆల్ రౌండర్ జట్టులో ఉంటే టీం సమతుల్యంగా ఉంటుంది. అటు ఐదవ బౌలర్ పాత్ర, ఇటు మిడిల్ ఆర్డర్ లో బ్యాటింగ్ పాండ్య సమర్ధవంతంగా పోషిస్తాడు.
ఇదిలా ఉండగా.. హార్ధిక్ పాండ్యాకు గాయమైనట్టు తెలిసినా.. బీసీసీఐ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో ఈ స్టార్ ఆల్ రౌండర్ గాయంపై పెద్దగా ఆదోళన అవసరం లేదని తెలుస్తుంది. కాగా ఆస్ట్రేలియా- భారత్ తమ వరల్డ్ కప్ తొలి మ్యాచుని అక్టోబర్ 8 న ఆడనున్నారు. చెన్నై చిదంబరం స్టేడియం ఈ మ్యాచుకు వేదిక కానుంది.