2024 ఐపీఎల్ సీజన్ ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యకు చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. కెప్టెన్ గా, ప్లేయర్ గా విఫలమైన పాండ్య.. స్లో ఓవర్ రేట్ మరింత కష్టాల్లోకి నెట్టింది. ముంబైలోని వాంఖడే వేదికగా నిన్న (మే 17) లక్నో సూపర్ జయింట్స్, ముంబై ఇండియన్స్ మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో పాండ్య స్లో ఓవర్ రేట్ కారణంగా మూల్యం చెల్లించుకున్నాడు.
ఈ సీజన్‌లో మూడోసారి (లక్నో సూపర్ జయింట్స్) స్లో ఓవర్ రేట్‌ను కొనసాగించినందుకు పాండ్యను బీసీసీఐ ఒక మ్యాచ్ సస్పెండ్ చేసింది. దీని ప్రకారం ముంబై తమ తర్వాత ఆడబోయే మ్యాచ్ కు దూరం కానున్నాడు. ముంబైకు నిన్న (మే 17) చివరి లీగ్ మ్యాచ్ కావడంతో 2025 ఐపీఎల్ ప్రారంభ మ్యాచ్ కు పాండ్యపై వేటు పడింది. మ్యాచ్ సస్పెండ్ చేయడంతో పాటు పంత్ కు రూ 30 లక్షల జరిమానా విధించారు.
ముంబై జట్టులోని ప్లేయింగ్ 11లో ఉన్న వారికి రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25% జరిమానా విధించబడింది. హార్దిక్ ఈ సీజన్ లో బ్యాటింగ్ లో ఘోరంగా విఫలమయ్యాడు. 14 మ్యాచ్‌లలో కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. బంతితో 11 వికెట్లు తీసి పర్వాలేదనిపించాడు. హార్దిక్ తొలి సారి కెప్టెన్సీ చేప్పట్టిన ముంబై ఇండియన్స్ 14 మ్యాచ్ ల్లో కేవలం నాలుగు మ్యాచ్ లు మాత్రమే గెలిచి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో నిలిచింది.
ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత లక్నో 20 ఓవర్లలో 214/6 స్కోరు చేసింది . కెప్టెన్ కేఎల్ రాహుల్ (41 బాల్స్‌లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 55) ఫిఫ్టీతో రాణించాడు. ముంబై బౌలర్లలో నువాన్ తుషార, పియూష్ చావ్లా చెరో మూడు వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ముంబై 20 ఓవర్లలో 196/6 స్కోరు చేసి ఓడింది. రోహిత్ శర్మ (38 బాల్స్‌లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 68), నమన్ ధీర్ (28 బాల్స్‌లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో 62 నాటౌట్) పోరాడారు. పూరన్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, లక్నో 14 మ్యాచ్‌ల్లో ఏడో విజయంతో14 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌లో (- –0.66 ) వెనుకబడి ప్లేఆఫ్స్ అవకాశాన్ని కోల్పోయింది.
Hardik Pandya will miss the first match of IPL 2025.
— Mufaddal Vohra (@mufaddal_vohra) May 18, 2024
- He has been banned for maintaining slow overrate. pic.twitter.com/sbtsd5Hv8I