క్రికెట్ లోకి హార్దిక్ పాండ్య రీ ఎంట్రీ.. 5 నెలల తర్వాత తొలి మ్యాచ్

భారత్ వేదికగా జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య గాయపడ్డాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన ఈ  మ్యాచ్‌లో చీలమండ గాయంతో హార్దిక్ పాండ్యా క్రికెట్ నుంచి క్రికెట్ కు దూరంగా ఉన్నాడు. గాయం నుంచి కోలుకున్న తర్వాత  తొలిసారిగా పోటీ క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్ధమయ్యాడు. సోమవారం DY పాటిల్ స్టేడియంలో ప్రారంభమైన T20 టోర్నమెంట్‌లో హార్దిక్ పాండ్యా పోటీ క్రికెట్ లోకి అడుగుపెట్టాడు. 

నవీ ముంబైలోని స్పోర్ట్స్ అకాడమీ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనున్న ఈ మ్యాచ్ కు రిలయన్స్ 1 జట్టుకు పాండ్యా కెప్టెన్‌గా ఉన్నాడు. భారత్ పెట్రోలియంతో ఈ మ్యాచ్ జరగనుంది. హార్దిక్‌తో పాటు ముంబై ఇండియన్స్‌కు చెందిన తిలక్ వర్మ, నేహాల్ వధేరా, పీయూష్ చావ్లా కూడా రిలయన్స్ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉన్నారు. అయితే ఈ జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కు జట్టులో చోటు దక్కించుకోలేకపోయాడు. 

ఐపీఎల్ లో 2024 సీజన్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా బాధ్యతలు స్వీకరించనున్నాడు.  ఈ విషయాన్ని యాజమాన్యం ప్రకటించింది. రోహిత్ శర్మ స్థానంలో పాండ్యాకు  బాధ్యతలు అప్పగించింది మేనేజ్మెంట్. దీంతో ఐపీఎల్ 2024లో ముంబై జట్టును  పాండ్యా లీడ్ చేయనున్నాడు. కెప్టెన్‌గా రోహిత్ జట్టుకు అద్బుతమైన సేవలను అందించాడని యాజమాన్యం కొనియాడింది.