LSG vs MI: లక్నోతో మ్యాచ్.. తుది జట్టు నుంచి రోహిత్ శర్మ ఔట్.. కారణమిదే!

LSG vs MI: లక్నోతో మ్యాచ్.. తుది జట్టు నుంచి రోహిత్ శర్మ ఔట్.. కారణమిదే!

ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ కు పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. శుక్రవారం (ఏప్రిల్ 4) లక్నో సూపర్ జయింట్స్ తో ప్రారంభమైన మ్యాచ్ లో స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ లేకుండానే ముంబై బరిలోకి దిగింది. లక్నో వేదికగా ఏకనా క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. టాస్ తర్వాత ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్య మాట్లాడుతూ రోహిత్ శర్మ దూరమవుతున్నట్టు చెప్పాడు. రోహిత్ కు మ్యాచ్ కు ముందు మోకాలి గాయమైందని తెలిపాడు. దీంతో హిట్ మ్యాన్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. 

రోహిత్ స్థానంలో 22 ఏళ్ళ ఆల్ రౌండర్ రాజ్ భవా తుది జట్టులో స్థానం సంపాదించాడు. హిట్ మ్యాన్ లేకపోవడంతో విల్ జాక్స్, రికెల్ టన్ ముంబై ఇన్నింగ్స్ ను ఓపెనింగ్ చేయనున్నారు. రోహిత్ శర్మకు గాయం తీవ్రతపై ఎలాంటి అప్ డేట్ లేదు. ఈ ముంబై మాజీ కెప్టెన్ తర్వాత జరిగే మ్యాచ్ కు అందుబాటులో ఉన్నాడా లేదా అనే విషయంలో క్లారిటీ లేదు. ఈ సీజన్ లో రోహిత్ శర్మ ఆడిన మూడు మ్యాచ్ ల్లోనూ విఫలమయ్యాడు. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో డకౌట్ కాగా.. ఆ తర్వాత గుజరాత్, కోల్ కతా లపై వరుసగా 8, 13 పరుగులు చేశాడు.       

►ALSO READ | సీఎస్కే ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. మళ్లీ కెప్టెన్సీ పగ్గాలు చేపట్టనున్న ధోని..!

ప్రస్తుతం లక్నోతో జరుగుతున్న మ్యాచ్ విషయానికి ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇరు జట్లకు ఇది టోర్నీలో నాలుగో మ్యాచ్. రెండు జట్లు కూడా ఆడిన మూడు మ్యాచ్ ల్లో రెండు ఓడిపోయి ఒక మ్యాచ్ లో గెలిచాయి. ఈ మ్యాచ్ లో ఓడిపోయిన జట్టు 3 పరాజయాలతో టోర్నీలో ప్లే ఆఫ్ ఆవకాశాలను సంక్లిష్టం చేసుకుంటుంది. లక్నో జట్టులో ఆకాష్ దీప్ గాయం నుంచి కోలుకొని ప్లేయింగ్ 11 లో చోటు సంపాదించాడు. మొదట బ్యాటింగ్ చేస్తున్న లక్నో నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసింది.