భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా, బ్రిటిష్ సింగర్ జాస్మిన్ వాలియా డేటింగ్ చేస్తున్నట్లు గత వారం రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ దిగిన ఫోటో లొకేషన్ ఒకటిగా ఉండడంతో ఈ చర్చ మొదలైంది. దీనికితోడు వీరిద్దరూ ఇటీవల సోషల్ మీడియాలో ఒకరినొకరు అనుసరించడంతో వీరి బంధం నిజమన్న వార్తలు గప్పుమన్నాయి. తాజాగా, వీరి రహస్య బంధంలో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హార్దిక్ పాండ్యా శరీరంపై బయటకు కనిపించేలా రకరకాల టాటూలు ఉంటాయన్న విషయం విదితమే. పాండ్యా ఎడమ చేతిపై బిలీవ్ అనే పదాన్ని టాటూగా వేయించుకోగా.. భుజంపై ధైర్యానికి చిహ్నామైన టైగర్ బొమ్మను టాటూగా వేయించుకున్నాడు. ఇక, ఎడమ భుజంపై కుమారుడు అగస్త్య పుట్టినరోజును జ్ఞాపకంగావేపించుకున్నాడు. ఈ టాటూనే అతని చీకటి బాగోతాన్ని బయటపెట్టింది.
సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఫొటోల్లో జాస్మిన్ పక్కన ఒక చేయి కనిపిస్తోంది. ఆ చేయిపై టాటూలు ఉన్నట్లు స్పష్టమవుతోంది. అచ్చం పాండ్యా చేతులపై సైతం అదే స్థలంలో టాటూలను కలిగి ఉండడంతో వీరి రహస్య బంధం బట్టబయలైంది. జంటగా వీరిద్దరూ గ్రీస్ అందాలను ఆస్వాదిస్తున్నారని నెటిజన్స్ పేర్కొంటున్నారు. అదే సమయంలో జాస్మిన్ వాలియా ముంబై ఇండియన్స్ ఐపీఎల్ మ్యాచ్‌లకు హాజరైన ఫోటోలు బయటకు రావడంతో వీరి బంధం నిజమన్న టాక్ వినపడుతోంది. ఈ రహస్య బంధం కారణంగానే నటాషా స్టాంకోవిక్ అతన్ని విడిచిపెట్టిందని కామెంట్లు హోరెత్తుతున్నాయి.
Hardik Pandya cheated on Natasha? Even after marriage, Hardik was dating a girl named Jasmine Walia.👀
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) August 14, 2024
- Jasmin Scame to watch the MIvsCSK IPL match on the 15th.
- Jasmin and Hardik spotted at same location
- Hardik's shoulder tattoo is visible in Jasmin's selfie pic.twitter.com/BTD25LakwZ
నటాషాకు నెటిజన్ల మద్దతు
మొదటి హార్దిక్ పాండ్యా విడాకుల వార్త బయటకు రాగానే, అందరూ నటాషాను విమర్శించారు. భర్త విదేశీ ప్రయాణాల్లో ఉండగా.. భార్య మరొకరితో విహరిస్తోందంటూ రకరకాల మాటలతో వేధించారు. ఇక, ఆమె జిమ్‌లో తన స్నేహితుడితో కనిపించినప్పుడు, నెటిజన్లు ఆమెను తిట్టడం, విడాకులకు ఆమె కారణమని నిందించడం చేశారు. వీటన్నింటిపై నటాషా ఆ సమయంలో ఎందుకు మౌనంగా ఉందొ ఇప్పుడు అర్థమవుతోంది. బ్రిటిష్ సింగర్‌తో పాండ్యా బంధం నచ్చకనే ఆమె విడాకులు తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. విడాకుల అనంతరం నటాషా.. కొడుకుతో కలిసి స్వదేశం సెర్బియా వెళ్ళిపోయింది.
Is Hardik Pandya & Jasmin Walia Dating each other?
— Sports with naveen (@sportswnaveen) August 14, 2024
- Rumours started when hardik & Jasmine posted similar vacation photo from Greece.
- They follow each other &
- Hardik Pandya has liked all recent photos of Jasmine
What do you think about this? 🤔#HardikPandya pic.twitter.com/tjqmKlgIJ8