బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో గాయపడిన టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ కూడా దూరమయ్యాడు. 2023 అక్టోబర్ 29న ఇంగ్లాండ్ తో జరగబోయే మ్యాచ్ కు అందుబాటులో ఉంటాడని ముందుగా వార్తలు వచ్చాయి కానీ హార్దిక్ రీఎంట్రీపై కీలక అప్‌డేట్ వచ్చింది. ఇంగ్లాండ్ తో కాదు .. శ్రీలంకతో 2023 నవంబర్ 2న జరగబోయే మ్యాచ్ లో కూడా పాండ్య అందుబాటులో ఉండడని తెలుస్తోంది.
చీలమండ గాయం కారణంగా ప్రస్తుతం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్‌సీఏ)లో ఉన్న శిక్షణ తీసుకుంటున్నాడు పాండ్య. అతని విషయంలో రిస్క్ తీసుకోకూడదని భావిస్తున్న టీమ్ మేనేజ్‌మెంట్ అతనికి రెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లుగా సమాచారం. ఇప్పటివరకు వరల్డ్ కప్ లో వరుసగా ఐదు మ్యాచ్ లు గెలిచిన టీమిండియా.. ఇంగ్లాడ్ తో కూడా గెలిచి సెమీస్ బెర్త్ ఖాయం చేసుకోవాలని చూస్తుంది.
లీగ్ దశలో అన్ని మ్యాచ్ లు గెలవాలని టీమిండియా భావిస్తుంది. హార్దిక్ పాండ్యకు గాయం కావడంతో అతని స్థానంలో సూర్యకుమార్ యాదవ్ కు చోటు కల్పించారు. కివీస్ తో జరిగిన మ్యాచ్ లో రనౌట్ రూపంలో పెవిలియన్‌కు చేరాడు. ఇంగ్లాండ్ తో మ్యాచ్ కి కూడా అతనికి మరో అవకాశం దొరకడం ఖాయం .