
ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యపై జరిమానా విధించబడింది. అహ్మదాబాద్ వేదికగా శనివారం (మార్చి 29) గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా పాండ్యకు రూ. 12 లక్షల రూపాయల ఫైన్ వేశారు. దీంతో ఐపీఎల్ 2025 సీజన్ లో స్లో ఓవర్ రేట్ కారణంగా తొలిసారి జరిమానా ఎదుర్కొన్న కెప్టెన్ గా నిలిచాడు. స్లో ఓవర్ రేట్ కారణంగా హార్దిక్ పాండ్య చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ కు దూరమయ్యాడు. అయితే నిషేధం తర్వాత వెంటనే అతను ఇదే తప్పును రిపీట్ చేయడం గమనార్హం.
ALSO READ | DC vs SRH: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్.. ఢిల్లీ జట్టులో రాహుల్
ఈ సీజన్ ప్రారంభానికి ముందు ఐపీఎల్ పాలక మండలి కొన్ని మార్పులు చేసింది. స్లో ఓవర్ రేట్ వేసిన కెప్టెన్లకు జరిమానా విధించబడదు. అయితే కెప్టెన్లకు డీమెరిట్ పాయింట్లు ఇస్తారు. ఇవి మూడు సంవత్సరాల పాటు కొనసాగుతాయి. ఈ నిషేధం తీవ్రమైన సందర్భాల్లో మాత్రమే జరుగుతుంది. గుజరాత్ తో జరిగిన మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో ముంబై ఇండియన్స్ 2 గంటల పాటు వేసింది. మ్యాచ్ 7:30 నిమిషాలకు ప్రారంభమైతే.. 9:30 నిమిషాల వరకు జరిగింది.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. సాయి సుదర్శన్ (41 బాల్స్‌లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 63) మెరుపు బ్యాటింగ్‌కు తోడు ప్రసిధ్ కృష్ణ (2/18), మహ్మద్ సిరాజ్ (2/34) సత్తా చాటడంతో ఐపీఎల్18లో గుజరాత్ టైటాన్స్ బోణీ చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో జీటీ 36 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్‌ను ఓడించింది. సీజన్‌లో ముంబైకి ఇది వరుసగా రెండో ఓటమి. తొలుత గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 196/8 స్కోరు చేసింది. భారీ లక్ష్య ఛేదనలో ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులకే పరిమితమైంది.
Hardik Pandya has been fined 12 Lakhs for slow over-rate against Gujarat Titans 🏆 pic.twitter.com/EDUgEwWeVB
— Johns. (@CricCrazyJohns) March 30, 2025