SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్

SRH vs MI: వరుసగా రెండు ఓటములు: పాండ్య భార్యను టార్గెట్ చేసిన నెటిజన్స్

ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక పాండ్య ప్రవర్తన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఓ వైపు కెప్టెన్ గా, మరోవైపు వ్యక్తిగతంగా హార్దిక్ పాండ్యపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. వరుసగా రెండు మ్యాచ్ ల్లో ఓటములు.. మాజీ కెప్టెన్ రోహిత్ ను లెక్క చేయకపోవడం, తమ కోచ్ లకు మర్యాద ఇవ్వకపోవడం లాంటి విషయాలు హార్దిక్ ప్రతిష్టను దిగజార్చాయి. రోహిత్ శర్మ స్థానంలో ముంబై కెప్టెన్ గా జట్టు పగ్గాలు చేపట్టిన హార్దిక్ తొలి మ్యాచ్ నుంచే ట్రోలింగ్ కు గురవుతున్నాడు.

పాండ్య కూడా తన ప్రవర్తన మారదన్నట్టు ఎవరినీ లెక్క చేయడం లేదు. దీంతో ఇప్పుడు నెటిజన్స్ పాండ్య భార్యను టార్గెట్ చేశారు. ఆమెను దారుణంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. హార్దిక్ పాండ్య భార్య పేరు నటాసా స్టాంకోవిక్. ఈమె సెర్బియాలో జన్మించి  మోడల్ గా సెటిల్ అయింది. "సత్యాగ్రహ", "ఫుక్రే రిటర్న్స్", "జీరో" వంటి అనేక బాలీవుడ్ చిత్రాలలో కనిపించింది. వీటితో పాటు "బిగ్ బాస్ 8","నాచ్ బలియే 9" వంటి రియాల్టీ షోలలో కూడా పాల్గొంది.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ లో పాండ్య కెప్టెన్సీలో ముంబై వరుసగా రెండు మ్యాచ్ లో ఓడిపోయింది. తొలి మ్యాచ్ లో గుజరాత్ పై ఛేజింగ్ చేస్తూ 6 పరుగుల తేడాతో.. సన్ రైజర్స్ తో 31 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. వ్యక్తిగత ప్రదర్శనలోనూ ఈ ముంబై కెప్టెన్ దారుణంగా విఫలమవుతున్నాడు. బ్యాటింగ్ పరుగులు చేయడంలో కష్టపడుతున్నాడు. మరోవైపు బౌలింగ్ లో భారీగా పరుగులు సమర్పించుకుంటున్నాడు.