
గజ్వేల్ ప్రజ్ఞాపుర్ లో నిర్వహించిన దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీశ్ రావు కాంగ్రెస్ మేనిఫెస్టోపై స్పందించారు. 42 పేజీల మానిఫెస్టో కాదు 420 మేనిఫెస్టో అన్నారు. ఎలాగు గెలిచేది లేదనుకున్న కాంగ్రెస్ పార్టీ ..అమలుకు సాధ్యం కాని హామీలను పేజీలకు పేజీలు రాశారని మంత్రి హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి విశ్వసనీయత లేదన్న హరీష్.. కర్ణాటక ప్రజలు కరంట్ కోసం అనేక కష్టాలు పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఎక్కడ కొడతారోనని 24 గంటలు కరంట్ ఇస్తామని మ్యానిఫెస్టోలో పెట్టామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ విడుదల చేసిన మ్యానిఫెస్టోలోని అంశాలను .... కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తుందా అని ప్రశ్నించారు. రైతు బంధు, కళ్యాణ లక్ష్మి, గొర్రెల పంపిణీ ఇలా అందులో సగం తాము అమలు చేస్తున్నవేనన్నారు. బీఆర్ఎస్ మేనిఫెస్టో ను కాంగ్రెస్ కాపీ కొట్టిందన్నారు.