
పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ మూవీ ‘హరిహర వీరమల్లు’. దర్శకుడు క్రిష్ కొంత భాగాన్ని తెరకెక్కించగా, జ్యోతి కృష్ణ బ్యాలెన్స్ షూట్‌ను చిత్రీకరిస్తున్నాడు.
మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏఎమ్ రత్నం సమర్పణలో ఎ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. చిత్ర నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ప్రస్తుతం రీ-రికార్డింగ్, డబ్బింగ్, వీఎఫ్ఎక్స్ పనులు ఫుల్ స్వింగ్‌లో జరుగుతున్నాయని మేకర్స్ చెప్పారు.
ఇందులోని ప్రతి ఫ్రేమ్‌ను జాగ్రత్తగా రూపొందిస్తున్నామని, ప్రతి సౌండ్‌ను చక్కగా ట్యూన్ చేస్తున్నామని, విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని అన్నారు. ఈ వేసవిలో వెండితెరపై మునుపెన్నడూ చూడని అద్భుతమైన అనుభూతిని ప్రేక్షకులకు అందించడానికి సిద్ధమవుతున్నట్టు చెప్పారు.
Re-recording, Dubbing, and VFX are in full swing—pushing boundaries at lightning speed.⚡🔥
— Hari Hara Veera Mallu (@HHVMFilm) April 11, 2025
We're gearing up to bring you the biggest cinematic spectacle of the summer!#HariHaraVeeraMallu hits the big screens on May 9th, 2025. ⚔️💥
Get ready for an epic experience like never… pic.twitter.com/mduDpojxgY
రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్ ‘హరిహర వీరమల్లు : స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’పేరుతో సమ్మర్ కానుకగా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో బాబీ డియోల్, అనుపమ్ ఖేర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సునీల్, నాజర్, రఘు బాబు, సుబ్బరాజు, జిషుసేన్ గుప్తా ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ ఎపిక్ యాక్షన్ డ్రామాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు.