HariHaraVeeraMallu: హరి హర వీరమల్లు విడుదల వాయిదా.. పవన్ తప్పుకోవడంతో ఆ రెండు సినిమాలకు లైన్ క్లియర్

HariHaraVeeraMallu: హరి హర వీరమల్లు విడుదల వాయిదా.. పవన్ తప్పుకోవడంతో ఆ రెండు సినిమాలకు లైన్ క్లియర్

పవన్ కళ్యాణ్‌‌‌‌ ‘హరిహర వీరమల్లు’ నుంచి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ మూవీ మరోసారి వాయిదా పడింది. లేటెస్ట్ గా (మార్చి 14న) హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ప్రకటించారు మేకర్స్.

మొదట మార్చి 28న విడుదల అవుతుందని ప్రకటించిన మేకర్స్, ఇప్పుడు మే 9న వస్తుందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో గుర్రంపై సవారీ చేస్తున్న పవన్ కల్యాణ్ చాలా ఫ్యూరియస్‌గా కనిపించాడు. పవన్ కల్యాణ్ వెనుక గుర్రాలపై హీరోయిన్ నిధి అగర్వాల్, ఇతర నటులు నాజర్, సుబ్బరాజు, కబీర్ సింగ్, సునీల్ ఉన్నారు.

"యుద్ధం సిద్ధమైంది, న్యాయం మరియు ధర్మం కోసం చేసే పోరాటం ఆపలేనిది! హరిహరవీరమల్లు అత్యున్నత వేగంతో వీరమల్లు యుద్ధానికి దిగుతున్నాడు. ఈసారి వేటను ఏదీ మార్చదు. మే 9, 2025న తెరలపైకి శౌర్య గాథను గుండెకు హత్తుకుంటారు" అంటూ మేకర్స్ నోట్ ద్వారా వెల్లడించారు. 

పవన్ కల్యాణ్ కెరీర్లో బిగ్గెస్ట్ పీరియాడికల్ యాక్షన్ మూవీగా హరిహర వీరమల్లు రానుంది. దర్శకుడు జ్యోతికృష్ణ రూపొందిస్తున్న ఈ చిత్రంలో చారిత్రాత్మక యోధుడి పాత్రలో పవన్ కళ్యాణ్ నటిస్తున్నాడు. సునీల్, నోరా ఫతేహి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

ALSO READ | చిరంజీవికి అరుదైన గౌరవం.. యూకే పార్లమెంట్‌ లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు

ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌పై ఏ దయాకర్‌‌‌‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు త‌‌మిళ‌‌, కన్నడ, మ‌‌ల‌‌యాళ, హిందీ భాష‌‌ల్లో సినిమా విడుద‌‌ల చేయ‌‌నున్నారు.

ఆ 2 సినిమాలకు లైన్ క్లియర్:

మార్చి 28న నితిన్ రాబిన్ హుడ్ మూవీతో వస్తున్నాడు. ఇక పవన్ కళ్యాణ్ మార్చి 28న రాడనే ఉద్దేశ్యంతోనే నితిన్ బరిలో దిగినట్లు టాక్. అలాగే నాగవంశీ తెరకెక్కించిన మ్యాడ్ స్క్వేర్ మూవీ కూడా మార్చి 28న వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఇటీవలే, నాగ వంశీ హరి హర వీరమల్లు రిలీజ్ వాయిదా పడితే వస్తాము అని చెప్పుకొచ్చాడు. ఇక వీరమల్లు తప్పుకోవడంతో నితిన్ మూవీకి, మ్యాడ్ స్క్వేర్ కి పెద్ద అవకాశం ఇచ్చినట్లు అయింది.