
టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా "హరిహర వీరమల్లు". ఈ సినిమాకి ప్రముఖ డైరెక్టర్స్ క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ కలసి దర్శకత్వం వహిస్తుండగా స్టార్ సినీ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు. ఈ సినిమా మార్చ్ 28న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. ఇందులో భాగంగా హరిహర వీరమల్లు లోని సెకెండ్ సింగిల్ ప్రోమోని మేకర్స్ యూట్యూబ్ లో రిలీజ్ చేశారు.
ఈ సాంగ్ లిరిక్స్ ‘కొరకొర మీసాలతో కొదమ కొదమ అడుగులతో’ అంటూ హీరోయిజాన్ని ఎలివేట్ చేస్తూ మొదలవుతాయి. పవన్ కళ్యాణ్ కూడా కర్ర సాము చేస్తూ పవర్ఫుల్ లుక్ లో కనిపించాడు. ఈ పాటని ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎం.ఎం. కీరవాణి కంపోజ్ చేశాడు. మంగ్లీ, రమ్య బెహర, యామిని ఘంటసాల, రాహుల్ సిప్లిగంజ్ తదితరులు పాడగా... ప్రముఖ లిరిక్ రైటర్ చంద్రబోస్ లిరిక్స్ అందించాడు. తెలుగు బ్యూటిఫుల్ యాంకర్ అనసూయ, యంగ్ హీరోయిన్ పూజిత పొన్నాడ నటించారు.
ఈ విషయం ఇలా ఉండగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ మొదలై దాదాపుగా 4ఏళ్ళు కావస్తోంది. కానీ అనుకోని కారణాలవల్ల అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. దీనికితోడు పవన్ కూడా రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఇప్పటికే 3సార్లు రిలీజ్ వాయిదా పడింది. కానీ ఈసారి మాత్రం ఏదేమైనా అనుకున్న సమయానికి రిలీజ్ చేస్తామని మేకర్స్ చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.
ALSO READ | మూవీ రివ్యూ: జాబిలమ్మ నీకు అంతా కోపమా.. రొమాంటిక్ థ్రిల్లర్ ఎలా ఉందంటే.?