PawanKalyan: పవన్‌ కల్యాణ్‌ Vs నితిన్‌?.. ఎటూ తేల్చుకోలేక ఆందోళనలో ఫ్యాన్స్!

PawanKalyan: పవన్‌ కల్యాణ్‌ Vs నితిన్‌?.. ఎటూ తేల్చుకోలేక ఆందోళనలో ఫ్యాన్స్!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో భారీ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న మూవీ హరిహర వీరమల్లు. భారీ అంచనాలతో రాబోతున్న ఈ సినిమా మార్చి 28న రిలీజ్ కానుందని గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేశారు. అంటే సినిమా రిలీజ్కు సరిగ్గా 28 రోజులు మాత్రమే ఉంది.

అయితే, హరిహర వీరమల్లు రిలీజ్ రోజే, యంగ్ హీరో నితిన్ మూవీ కూడా రాబోతుంది. నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘రాబిన్‌‌‌‌హుడ్’. ఈ మూవీ కూడా మార్చి 28న రిలీజ్ కానుంది. కామెడీ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రానున్న ఈ మూవీపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి.

హీరో నితిన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు వీరాభిమాని అని తెలిసిందే. ఇక వీరిద్దరి మధ్యే పోటీ ఉండటం అటు పవన్ కళ్యాణ్, ఇటు నితిన్ ఫ్యాన్స్లో ఒక రకంగా ఆసక్తి కలిగిస్తున్నప్పటికీ, మరోపక్క ఆందోళన కలిగిస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. వీర‌మ‌ల్లు మూవీ మార్చి 28 నుంచి వాయిదా ప‌డే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇంకా కొంత షూటింగ్ బ్యాలెన్స్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాంతో పవన్ కళ్యాణ్ ఒక 5 రోజులు డేట్స్ ఇస్తే షూటింగ్ కంప్లీట్ చేసుకొంటుందని సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. మరి పవన్ రాజకీయాల్లో బిజీ ఉండటం చూస్తుంటే ఇప్పట్లో డేట్స్ అడ్జస్ట్ చేయడం కష్టమే అనిపిస్తోంది.

ఇక పవన్ కళ్యాణ్ మార్చి 28న రాడనే ఉద్దేశ్యంతోనే నితిన్ బరిలో దిగినట్లు టాక్. అన్నీ కుదిరితే  ఏప్రిల్ 11 లేదా ఏప్రిల్ 18 న వీరమల్లు థియేటర్లో సందడి చేసే ఛాన్స్ ఉందని నిర్మాతలు భావిస్తున్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఏమవుతుందో. ఒకవేళ వీరిద్దరూ మార్చి 28న వస్తే మాత్రం పవన్‌ కల్యాణ్‌ Vs నితిన్‌ అన్నది ఖాయం!

ఇకపోతే.. హరిహర వీరమల్లు సినిమా కొంతభాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించగా మిగతా భాగాన్ని జ్యోతికృష్ణ తెరకెక్కిస్తున్నాడు. పవన్ సరసన నిధి అగర్వాల్ నటిస్తోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీ తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో వరల్డ్‌‌‌‌వైడ్‌‌‌‌గా విడుదల కానుంది.