హరి హర వీరమల్లు మూవీ ఫస్ట్ పార్ట్‌‌ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో విడుదల

హరి హర వీరమల్లు మూవీ ఫస్ట్ పార్ట్‌‌ స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో  విడుదల

పవన్ కళ్యాణ్ హీరోగా ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తున్నారు. వాటిలో ఒకటి ‘హరి హర వీరమల్లు’. పీరియాడికల్‌‌ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం కోసం పవన్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ పూర్తయింది.  బ్యాలెన్స్ షూటింగ్‌‌ను, పోస్ట్ ప్రొడక్షన్‌‌ పనులను క్రిష్ పర్యవేక్షణలో దర్శకుడు జ్యోతి  కృష్ణ తెరకెక్కించబోతున్నాడు. అతి త్వరలో చిత్రీకరణ మొదలుపెడుతున్నట్టు తెలియజేశారు. రెండు భాగాలుగా రూపొందుతోన్న ఈ మూవీ ఫస్ట్ పార్ట్‌‌ను ఈ ఏడాది చివరిలో ‘స్వార్డ్ వర్సెస్ స్పిరిట్’ పేరుతో  విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. 

ఎ.ఎం.రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్‌‌‌‌పై ఏ దయాకర్‌‌‌‌ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పవన్ కెరీర్‌‌‌‌లోనే  ఇది మొదటి హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ సినిమా. నిధి అగర్వాల్ హీరోయిన్‌‌గా, బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సునీల్, నోరా ఫతేహి ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.  కీరవాణి  సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు త‌‌మిళ‌‌, కన్నడ, మ‌‌ల‌‌యాళ, హిందీ భాష‌‌ల్లో సినిమా విడుద‌‌ల చేయ‌‌నున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌‌‌‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి.