బిగ్బాస్ సీజన్1 కంటెస్టెంట్, నటి హరితేజ(HariTeja) విడాకులపై కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆమె భర్తతో విడిపోయినట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా లేకపోవడంతో ఈ వార్తలు నిజమేననే టాక్ నడిచింది. దీంతో ఈ విషయంపై హరితేజ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో యాక్టివ్గా లేనంత మాత్రాన మనుషులను చంపేసేలా ఉన్నారే అంటూ ఓ పోస్ట్ పెట్టింది. దీనికి తన భర్తతో ఉన్న ఫొటోను యాడ్ చేసింది.
కర్నాటకకు చెందిన దీపక్ అనే వ్యక్తిని 2015లో హరితేజ పెళ్లి చేసుకుంది. వీరికి రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. తన కామెడీ టైమింగ్తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హరితేజ తెలుగులో నితిన్ అఆ, ప్రతిరోజు పండగే, సరిలేరు నీకెవ్వరూ వంటి సినిమాల్లో నటించింది.
ప్రస్తుతం హరితేజ ఆస్ట్రేలియా ట్రిప్లో సింగిల్‌గానే ఎంజాయ్ చేస్తోంది. కుమార్తెను తన తల్లి దగ్గర వదిలి మరి ఎంజాయ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే చాలా గ్యాప్ తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్తో ముచ్చటించి..చిట్చాట్ సెషన్తో ఈ సంచలన కామెంట్స్ చేసింది.
ఈ చిట్చాట్లో భాగంగా నెటిజన్ స్పందిస్తూ..సీరియల్ నటి నవ్యతో విడిపోయారా? అంటూ అడగగా..అది అవదమ్మా..అంటూ హరితేజ ఆన్సర్ ఇచ్చింది. దీంతో తమ ఇద్దరి మధ్య ఉన్న స్నేహబంధం ఎంతో స్ట్రాంగ్ అని చెప్పింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో హరితేజ న్యూస్ వైరల్ అవుతుంది.
TvAnchor, HariTeja, Filmindustry, Divorce, Socialmedia, AnchorHariteja, SerialactorNavya, Haritejahusband, HariTeja ChitChat, HariTeja Instagram Posts, HariTeja News, Tollywood News, V6 News, Viral News