రూ.33.6 కోట్ల చెక్‌‌‌‌‌‌‌‌ ఇస్తే..క్యాండీ చేతిలో పెట్టారు!

రూ.33.6 కోట్ల చెక్‌‌‌‌‌‌‌‌ ఇస్తే..క్యాండీ చేతిలో పెట్టారు!

న్యూఢిల్లీ: పోగొట్టుకున్న రూ.33.6 కోట్ల విలువైన చెక్‌‌‌‌‌‌‌‌ను ఎవరైనా తీసుకొచ్చి ఇస్తే వారికి రిటర్న్‌‌‌‌‌‌‌‌గా మీరైతే ఏమిస్తారు? మీ గురించి ఏమో కాని గమ్మిబేర్స్‌‌‌‌‌‌‌‌ రూపంలో క్యాండిస్‌‌‌‌‌‌‌‌ తయారు చేసే జర్మనీ కంపెనీ హరిబో మాత్రం  ఆరు యూరోల (రూ.507) విలువైన క్యాండిస్‌‌‌‌‌‌‌‌ ఇచ్చి, థ్యాంక్స్ చెప్పి చేతులు దులుపుకుంది. జర్మనీకి చెందిన అనౌర్ జీకి రోడ్డుపైన 4,631,538.80 యూరోల (రూ.33.6 కోట్ల)  విలువైన క్రాస్డ్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ (అకౌంట్ పేయి చెక్‌‌‌‌‌‌‌‌) దొరికింది. ఒక సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌   హరిబోకు ఈ చెక్‌‌‌‌‌‌‌‌ను ఇష్యూ చేసింది.  క్రాస్ట్‌‌‌‌‌‌‌‌  చెక్ అంటే కేవలం ఎవరి అకౌంట్ డిటెయిల్స్ ఉంటే వారి అకౌంట్‌‌‌‌‌‌‌‌లోనే డబ్బులు పడతాయి. క్యాష్‌‌‌‌‌‌‌‌ను చేతికి ఇవ్వరు. ఇంత పెద్ద మొత్తంలోని చెక్‌‌‌‌‌‌‌‌ను ఎప్పుడూ చూడలేదని,  చెక్‌‌‌‌‌‌‌‌పైన ఉన్న నెంబర్లను చదవలేకపోయానని అనౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జర్మనీ పబ్లికేషన్‌‌‌‌‌‌‌‌ బిల్డ్‌‌‌‌‌‌‌‌కు చెప్పారు.

తర్వాత హరిబోకి కాంటాక్ట్ అయ్యానని, చెక్‌‌‌‌‌‌‌‌ను చింపేసి దాని ఫొటోలను పంపమని  కంపెనీ లాయర్ చెప్పాడని వివరించారు. అలానే చేశానని, కంపెనీ థ్యాంక్యూ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌గా ఆరు ప్యాక్‌ల క్యాండీ ఇచ్చిందని చెప్పారు. అనౌర్ మాత్రం ఇదొక చీప్‌‌‌‌‌‌‌‌ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌ అని భావిస్తున్నారు. ఎలాగో క్రాస్డ్‌‌‌‌‌‌‌‌ చెక్‌‌‌‌‌‌‌‌ కాబట్టి, కేవలం కంపెనీ మాత్రమే రిడీమ్‌‌‌‌‌‌‌‌ చేసుకోగలదని ఆయన అన్నారు. ప్రస్తుతం ఈ విషయం ట్విట్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో హల్ చల్ అవుతోంది.  ‘4 మిలియన్ యూరోలు అనౌర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు దొరికినట్టు కాదు! హరిబో మరొక చెక్‌‌‌‌‌‌‌‌ను ఇష్యూ చేయమని సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్‌‌‌‌‌‌‌‌ చెయిన్‌‌‌‌‌‌‌‌కు చెప్పగలదు. కనిపెట్టినందుకు ఫీజు దొరుకుతుందని అనుకుంటున్నాడా?’ అని కొంత మంది, ‘4 మిలియన్ యూరోల చెక్‌‌‌‌‌‌‌‌ను కనిపెట్టి ఇస్తే, 6 యూరోల క్యాండీలు చేతిలో పెట్టారు.  ఇంతకన్నా పిసినారి ఎవరూ ఉండరు’ అంటూ మరికొంత మంది ట్వీట్​ చేశారు.