బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రముఖ బిజినెస్ మెన్ సుఖేష్ చంద్ర శేఖర్ మనీలాండరింగ్ కేసు వ్యవాహారంతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు ఎదుర్కుంటోంది. దీంతో ఢిల్లీ పోలీసులు పలుమార్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విచారణకి రావాలని ఆదేశాలు జారే చేశారు. అయితే మంగళవారం ఢిల్లీ హై కోర్టులో విచారణ జరిగింది.
దీంతో జాక్వెలిన్ తరుపు న్యాయవాది తన క్లయింట్ సుఖేష్ చంద్రశేఖర్ కి సంబందించిన ఎటువంటి లావాదేవీలు, అక్రమ సంపాదన వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాలేదని కోర్టుకి తెలిపాడు. అలాగే ఇప్పటివరకూ జరిగిన విచారణలో జాక్వెలిన్ ఫెర్నాండేజ్ సుఖేష్ చంద్రశేఖర్ నుంచి అక్రమంగా డబ్బు తీసుకున్నట్లు అధరాలు లేవని కాబట్టి ఆమెపై మనీలాండరింగ్ కేసులు పెట్టలేమని వాదించాడు. దీంతో జస్టిస్ అనిష్ దయాల్ నెక్స్ట్ హియరింగ్ ని డిసెంబర్ 3కి వాయిదా వేశారు.
ఈ విషయం ఇలా ఉండగా అప్పట్లో చెన్నై కి చెందిన సుఖేష్ చంద్రశేఖర్ బహుమతుల రూపంలో దాదాపుగా రూ.20 కోట్లు ఇచ్చినట్లు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై ఈడీ అభియోగాలు మోపింది. ఈ క్రమంలో ముంబైలో ఉన్నటువంటి కాస్ట్ లీ ఏరియాలో దాదాపుగా రూ.10 కోట్లు విలువ చేసే ఇల్లు, నగలు, కారు వంటివి ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు.
దీంతో ఈ ఆస్తులని జప్తు చేసి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు. అయితే సుఖేష్ చంద్రశేఖర్ మరో బాలీవుడ్ నటి అయిన నోరా ఫతేహికి కూడా కోట్లు విలువ చేసే బహుమతులు ఇచ్చినట్లు ఈడి పేర్కొంది. దీంతో ఈ వ్యవహారం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గ మారింది.
నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ప్రస్తుతం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి నూతన డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తుండగా ప్రముఖ తెలుగు సినీ నిర్మాత ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నాడు.
ప్రస్తుతం హరిహర వీరమల్లు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ పరిసర ప్రాంతంలో షూటింగ్ జరుపుకుంటోంది. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఏప్రిల్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారు.