పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలు అప్పుడే స్టార్ట్ అయిపోయాయి. సెప్టెంబర్ 2వ తేదీ ఆయన జన్మదినం సందర్భంగా.. ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి సంబంధించి కొత్త పోస్టర్ ను చిత్ర బృందం రిలీజ్ చేసింది. 2వ తేదీ సాయత్రం 5.45 గంటలకు పవర్ గ్లాన్స్ విడుదల చేయనున్నట్లు వెల్లడించింది. న్యూ పోస్టర్ లో కోర మీసం, పొడవాటి జుట్టుతో ఉన్న పవన్ శత్రువులపై దండెత్తడానికి రథంపై వెళుతున్నాడు. పవర్ గ్లాన్స్ పేరుతో ఓ పవర్ ఫుల్ వీడియోను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారి ఆనందం మరింత పైకి తీసుకెళ్లేలా వీడియో ఉంటుందని టాక్. ఇప్పటివరకు ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ 50 శాతం పూర్తయిందని, త్వరలో నూతన షెడ్యూల్ ప్రారంభమవుతుందని నిర్మాత ఎ. దయాకర్ రావు వెల్లడించారు.
ప్రేక్షకులను అలరించేలా ‘హరిహర వీరమల్లు’ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో రూపు దిద్దుకుంటోందని తెలిపారు. పవన్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్నారు. 17వ శతాబ్దం నాటి మొఘలాయిలు, కుతుబ్ షాహీల జరిగే కథతో విజువల్ ఫీస్ట్ గా రూపొందుతోంది. ఒక లెజండరీ బందిపోటు వీరోచిత గాథ అని, భారతీయ సినిమాలో ఇప్పటిదాక ఇలాంటి కథను తెరకెక్కించలేదని చిత్ర బృందం పేర్కొంటోంది. పాన్-ఇండియా స్థాయిలో నిర్మితమౌతున్న ఈ సినిమాని తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఏకకాలంలో విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శకత్వంలో లెజెండరీ ప్రొడ్యూసర్ ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై నిర్మాత ఎ.దయాకర్ రావు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
#HariHaraVeeraMallu ~ #PowerGlance HD Still ?
— Hari Hara Veera Mallu (@HHVMFilm) September 1, 2022
Download: https://t.co/nr2eAWbqOR pic.twitter.com/Hv4HuJDEOL