
- వారంపాటు అప్పగిస్తూ కోర్టు ఆదేశాలు
ఎల్బీ నగర్, వెలుగు: సంచలనం సృష్టించిన నవీన్ హత్య కేసులో నిందితుడు హరిహరకృష్ణను 7 రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ రంగారెడ్డి జిల్లా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ స్పెషల్ కోర్టు గురువారం ఆదేశాలు ఇచ్చింది. దీంతో చర్లపల్లి జైలులో ఉన్న హరిహర కృష్ణను అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. శుక్రవారం నుంచి వారం రోజుల పాటు అతడిని విచారించనున్నారు. హత్య జరిగిన తీరుపై సీన్ రీ కన్ స్ట్రక్షన్ చేయనున్నారు.
మూసారాం బాగ్ నుంచి పెద్ద అంబర్పేట్ వైన్స్ వరకు.. అక్కడి నుంచి అబ్దుల్లాపూర్ మెట్లోని మర్డర్ చేసిన ప్రాంతం వరకు.. మళ్లీ అక్కడి నుంచి బ్రాహ్మణపల్లి వరకు.. బ్రాహ్మణపల్లి నుంచి హాసన్ ఇంటికి, ఆ తర్వాత మళ్లీ మర్డర్ జరిగిన ప్రాంతంలో హరితో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేయించనున్నారు. అతడు ఇచ్చే సమాచారం ఆధారంగా మరిన్ని ఆధారాలను సేకరించనున్నారు.