రాజేంద్రప్రసాద్, శ్రీరామ్, దివి, పూజిత పొన్నాడ, మౌనిక రెడ్డి, అర్జున్ అంబటి ప్రధాన పాత్రలు పోషించిన వెబ్ సిరీస్ ‘హరికథ’ (Harikatha). మ్యాగీ దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. డిసెంబర్ 13 నుంచి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ (Disney+ Hotstar Telugu) ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చింది. ఈ వెబ్ సీరీస్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది.
హరికథలు చెబుతూ జీవితాంతం హరి నామస్మరణ చేసే రంగాచారి పాత్రలో రాజేంద్రప్రసాద్ కనిపించారు. ఈ సిరీస్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యేలా ఉంది. ఇందులో నటించిన పాత్రలు గుర్తుండిపోయేలా నటించారు. ఇందులో దివి చామంతి పాత్రలో ఆకట్టుకుంది.
డిఫరెంట్ స్క్రిప్ట్ తో తెరకెక్కిన ఈ మూవీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేసేలా సాగింది. డైరెక్టర్ మ్యాగీ తెరకెక్కించిన ఈ సిరీస్ తెలుగులో విజయం సాధించిన వెబ్ సిరీస్ ల జాబితాలో చేరేలా స్క్రీన్ ప్లే ఉంది. సురేష్ బొబ్బిలి అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇంటెన్స్ రేపుతోంది. కాగా ఈ సిరీస్ కి డీవోపీ విజయ్ ఉలగనాథ్. ఎడిటర్ జునైద్ సిద్ధిఖీ. థ్రిల్లర్ వెబ్ సీరీస్ లు ఇష్టపడే వారికి హరికథలు వెబ్ సీరీస్ మంచి ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఆదివారం చూసి ఎంజాయ్ చేయండి.