
మెదక్, వెలుగు: టార్గెట్మేరకు సీఎంఆర్ఇవ్వనందుకు జిల్లాలో మరో రెండు రైస్‌మిల్లులపై క్రిమినల్ కేసులు నమోదు చేసినట్టు సివిల్ సప్లై డీఏం హరికృష్ణ తెలిపారు. హవేలి ఘనపూర్శారదా ట్రేడర్ రైస్‌మిల్‌కు 1,765 టన్నుల ధాన్యం ఇవ్వడం జరిగిందన్నారు. అందుకుగాను 1,183 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉండగా కేవలం 230 టన్నులు మాత్రమే ఇచ్చారని తెలిపారు.
ఇంకా 953 టన్నుల సీఎంఆర్ ఇవ్వకపోగా, సదరు రైస్ మిల్లును తనిఖీ చేయగా రూ.4.75 కోట్ల విలువైన 1,422 టన్నుల ధాన్యం లేకపోవడంతో క్రిమినల్ కేసు నమోదు చేసినట్టు వివరించారు. అలాగే ఇదే మండల పరిధి బూర్గుపల్లిలోని భాగ్యలక్ష్మి ట్రేడర్స్ రైస్ మిల్లుకు 784 ధాన్యం సరఫరా చేయగా 526 టన్నుల సీఎంఆర్ ఇవ్వాల్సి ఉందన్నారు. కేవలం 114 టన్నుల సీఎంఆర్ మాత్రమే సరఫరా చేసి 411 టన్నుల సీఎంఆర్ ఇవ్వలేదన్నారు. రూ.2 కోట్ల విలువైన సీఎంఆర్ ఇవ్వనుందుకు గాను సదరు మిల్లుపై క్రిమినల్కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సంబంధిత మిలర్ల నుంచి ఆర్ ఆర్యాక్ట్కింద రికవరీకి చర్యలు తీసుకుంటామని డీఎం చెప్పారు.