భారత సంతతి బాలలు ప్రపంచ వేదికలపై విజేతగా నిలిచి సత్తాచాటుతున్నారు.తాజాగా ఈ జాబితాలో భారతీయ సంతతికి చెందిన బాలలు హరిణి లోగన్, విక్రమ్ రాజు చేరారు. వీరు ఈ ఏడాది నిర్వహించిన స్క్రిప్స్ జాతీయ స్పెల్లింగ్ బీ 2022 పోటీల్లో ఛాంపియన్లుగా నిలిచారు.అమెరికాలోని వాషింగ్టన్ లో ఈ పోటీలు జరిగాయి. హరిణి లోగన్ ఈ పోటీల్లో ఛాంపియన్ గా నిలిచింది.14 ఏళ్ల హరిణి శాన్ ఆంటోనియోలో 8వ గ్రేడ్ చదువుతోంది.స్పెల్ ఆఫ్ ఫైనల్లో డెన్వర్ కు చెందిన 12 ఏళ్ల విక్రమ్ రాజును ఓడించింది.కేవలం 90 సెకన్ల స్పీడ్ తో స్పెల్లింగ్ బీ కాంపిటీషన్ ట్రోఫీని ఎగురేసుకుపోయింది హరిణి. 21 పదాలను తప్పు లేకుండా చెప్పింది. ఇక విక్రమ్ రాజు 15 పదాలను తప్పులేకుండా చెప్పాడు.
ఈ పోటీల్లో 230 మంది పాల్గొనగా.. వీరందరినీ వెనక్కి నెట్టి హరిణి ముందు నిలవడం విశేషం. ఇక ఫైనల్ రౌండ్‌లో scyllarian, pyrrolidone, Otukian, Senijextee వంటి కఠిన పదాలకి సైతం ఆమె ఏమాత్రం తడబాటుకు గురికాకుండా కరెక్ట్ స్పెల్లింగ్స్ చెప్పడంతో విజేతగా నిలిచింది.హరిణికి నిర్వాహకులు జ్ఞాపికతో పాటు రూ.38లక్షల నగదు పారితోషికం అందజేశారు. ఇక రన్నరప్‌గా నిలిచిన విక్రమ్ రాజుకు రూ.22లక్షల ప్రైజ్‌మనీ దక్కింది.
Indian American Harini Logan wins 2022 Scripps National Spelling Bee by correctly spelling 22 words in the Spell-off.
— ANI (@ANI) June 3, 2022
(Pic Source: Scripps National Spelling Bee) pic.twitter.com/0hW8XB4M9U