వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆస్తుల కేసులపై... మాజీ ఎంపీ హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి హైకోర్టులో విచారణ జరిగింది. సీబీఐ కోర్టుల ఉన్న జగన్ కేసుల విచారణను స్పీడప్ చేయాలని హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఈ కేసులకు సంబంధించి పూర్తి నివేదికను సీబీఐ కోర్టుకు సమర్పించింది. హరిరామజోగయ్య దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన హైకోర్టు తదుపరి విచారణను ఆగస్టు 20 కి వాయిదా వేసింది.