టీమిండియా దెబ్బ అదుర్స్ కదూ.. : కొత్త బౌలర్లను దించిన పాకిస్తాన్

టీమిండియా దెబ్బ అదుర్స్ కదూ.. : కొత్త బౌలర్లను దించిన పాకిస్తాన్

ఆసియా కప్ లో భాగంగా  నిన్న జరిగిన సూపర్-4 మ్యాచులో టీమిండియా పాకిస్థాన్ బౌలర్లను చీల్చి చెండాడింది. ఏ ఒక్కరిని వదలకుండా భారత బ్యాటర్ల దెబ్బ రుచి చూపించింది. గ్రూప్ దశలో పాక్ బౌలర్లకు తల వంచితే.. నిన్న సూపర్-4మ్యాచులో అంతకు రెండు రెట్లు ప్రతీకారం తీర్చుకుంది. దీంతో నిన్న జరిగిన మ్యాచులో టీమిండియా ఏకంగా 228 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి పాక్ పై  విజయ ఢంకా మోగించింది. భారత బ్యాటర్ల జోరు ముందు ఇద్దరు పాకిస్థాన్ బౌలర్లకు గాయాలవ్వడం విశేషం. ప్రధాన పేసర్లు నజీమ్ షా, హారిస్ రౌఫ్ నిన్నటి మ్యాచులో బౌలింగ్ వేయలేకపోవడంతో పాటు బ్యాటింగ్ కి కూడా దిగలేదు. దీంతో వీరి ప్లేస్ లో మరో ఇద్దరు పేసర్లను బ్యాకప్ గా స్క్వాడ్ లోకి చేర్చుకుంది. 

జట్టులో దహాని, జమాన్ ఖాన్


ఆసియా కప్ లో టాప్ పేసర్లుగా విర్ర వీగిన పాకిస్థాన్ జట్టుకు తగిన శాస్తి జరిగిందని భారత అభిమానులు భావిస్తున్నారు. టోర్నీకి ముందు మా బౌలింగ్ ని ఎవ్వరూ ఆడలేరు అని గొప్పలకు పాక్.. వారి తదుపరి మ్యాచులకు పేసర్లు నజీమ్ షా, హారిస్ రౌఫ్ సేవలను కోల్పోనుంది. వీరిద్దరి స్థానాల్లో పాకిస్థాన్ బోర్డు ఫాస్ట్ బౌలర్లు షానవాజ్ దహానీ మరియు జమాన్ ఖాన్‌లను ఆసియా కప్‌కు బ్యాకప్‌లుగా పిలిచింది.

ఆదివారం హారిస్ "తన కుడి పార్శ్వంలో కొద్దిగా అసౌకర్యం" అనుభవించాడని పిసిబి పేర్కొంది,ఇక నజీమ్ షా కి చిన్న గాయమే అయినప్పటికీ ఎప్పుడు బరిలోకి దిగుడుతాడో చెప్పలేని పరిస్థితి. పైగా వచ్చే నెలలో వరల్డ్ కప్ ఉండడంతో వీరిద్దరూ ఆసియా కప్ కు దూరంగా ఉంచాలని పాక్ యాజమాన్యం భావిస్తుంది. ఈ మ్యాచులో 5 ఓవర్లు వేసిన రౌఫ్ 27 పరుగులు సమర్పించుకున్నాడు. మరో పేసర్ నజీమ్ షా 9.2 ఓవర్లలో 53 పరుగులు ఇచ్చి పర్వాలేదనిపించాడు.