ఏపీ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా(Harish Kumar Gupta) నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ ద్వారకా తిరుమలరావు ఈ నెల 31న పదవీ విరమణ చేయనుండటంతో.. హరీష్ గుప్తాను తదుపరి పోలీస్ బాస్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ఈ ఏడాది ఆగస్టు వరకు ఆ బాధ్యతల్లో కొనసాగనున్నారు.1992 బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
వాస్తవానికి నిరుడు సార్వత్రిక ఎన్నికల ముందు కేంద్ర ఎన్నికల కమిషన్ అప్పటి డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డిని తప్పించి ఇన్ఛార్జ్ డీజీపీగా గుప్తాను నియమించింది. అనంతరం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సీనియారిటీకి ప్రాధాన్యం ఇస్తూ ద్వారకా తిరుమలరావును డీజీపీగా నియమించారు. ఇప్పుడు ఆయన పదవీ కాలం ముగియనుండటంతో.. హరీశ్ కుమార్ గుప్తా మరోసారి డీజీపీ బాధ్యతలు చేపట్టినట్టైంది.