బస్తీ వాసులు, జంట నగరాల్లోని పేదల కోసం సీఎం కేసీఆర్ ఆలోచించారన్నారు మంత్రి హరీశ్ రావు. నార్సింగిలో డయాగ్నొస్టిక్ మినీ హబ్ ను మంత్రి హరీష్ మంత్రి హరీశ్ రావు ప్రారంభించారు. బస్తీ ప్రజల సుస్తీ పోగొట్టడానికి 350 బస్తీ దవాఖానాలు ప్రారంభించామన్నారు. టీ డయగ్నొస్టిక్స్ ద్వారా ప్రస్తుతం 57 రకాల పరీక్షలను ఉచితంగా చేయనున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో 134 పరీక్షలు ఉచితంగా చేస్తామన్నారు. బస్తీ దవాఖానాల రూట్ కోసం కొత్తగా యాప్ తీసుకొచ్చామన్నారు మంత్రి హరీశ్ రావు. టెస్టుల రిపోర్టులు కూడా యాప్ లో భద్రంగా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల చిట్టి బయటకు రాస్తే డాక్టర్ ఇంటికేనన్నారు. ప్రజలకు నమ్మకం పెంచడానికి కృషి చేస్తామన్నారు. స్థానిక ఆస్పత్రుల్లో పనితీరును పరిశీలించాలని ఎమ్మెల్యేలనుఆదేశించారు మంత్రి హరీశ్ రావు.
బస్తీ దవాఖానాల్లో చేసిన పరీక్షల వివరాలు కూడా అందుబాటులో ఉంటాయన్నారు. హైదరాబాద్ మహానగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీలు ప్రారంభించబోతున్నామన్నారు. టీమ్స్ గచ్చిబౌలి లో వెయ్యి పడకల ఆస్పత్రి త్వరలో ప్రారంభిస్తామన్నారు. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో 6 వేల బెడ్స్ అందుబాటులో రాబోతున్నాయన్నారు.రాష్ట్రంలో ఆశ వర్కర్లు ప్రతి ఇంటికి వెళ్లి బీపీ, షుగర్ గోళీలు NCD కిట్ పంపిణీ చేస్తారన్నారు.