కేటీఆర్ తొలి అడుగులోనే విజయం సాధించారు :హరీశ్ రావు

కేటీఆర్ తొలి అడుగులోనే విజయం సాధించారు :హరీశ్ రావు

సీఎం రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణకు రూ. 600 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు.  రేవంత్ నిండు సభలో అబద్ధాలు చెప్పారన్నారు.  ఫార్ములా ఈ రేస్ పై సభలో చర్చ ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించారు.   రాష్ట్ర ప్రతిష్టను  రేవంత్ దెబ్బతీశారని విమర్శించారు.  ఫార్ములా ఈ రేసులో రూ. 600 కోట్ల నష్టమనేది తప్పుడు ప్రచారమన్నారు.   

ఫార్ములా ఈ  రేస్  కేసులో  హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నారు హరీశ్ రావు. తొలి అడుగులోనే కేటీఆర్ విజయం సాధించారని చెప్పారు.    ఈ వ్యవహారంలో అవినీతి జరగలేదని స్వయంగా మంత్రి పొన్నం చెప్పారన్నారు.  అవినీతి జరగనప్పుడు ఏసీబీ ద్వారా కేసు ఎలా పెడతారని ప్రశ్నించారు హరీశ్.  కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు.  హామీల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్  ఈ జిమ్మిక్కులు చేస్తున్నారని ధ్వజమెత్తారు.  గ్యారంటీల గారడీ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు హరీశ్.

 ఫార్ములా ఈ కార్ రేసు కేసులో  కేటీఆర్ ను 10 రోజుల పాటు అరెస్ట్ చేయొద్దని  హై కోర్టు ఆదేశించింది. అయితే  ఏసీబీ విచారణ కొనసాగించవచ్చని  చెప్పింది. ఏసీబీ ఎఫ్ఐఆర్  కొట్టేయాలని హైకోర్టులో కేటీఆర్ పిటిషన్  వేయగా హైకోర్టు ఇవాళ విచారించింది.  ఈ సందర్భంగా..  కేటీఆర్ ను డిసెంబర్ 30 వరకు అరెస్ట్ చేయొద్దని ఆదేశించింది. కేసు కొట్టేయాలన్న కేటీఆర్ వాదనను  తిరస్కరించింది. కేసులో విచారణకు ఎవరినైనా పిలవొచ్చని తెలిపింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీని ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 27కు  వాయిదా వేసింది కోర్టు.