
సిద్దిపేట, వెలుగు : ఈనెల 17న సిద్దిపేటలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహణకు అనువైన స్థలాలను బుధవారం మంత్రి హరీశ్ రావు పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు. సిద్దిపేట పట్టణ సమీపంలోని వేములవాడ కామాన్ వద్ద గల స్థలాన్ని, నాగదేవత గుడి నుండి సిరిసిల్ల రోడ్డు కు వెళ్లే బైపాస్ రోడ్డు లో గల స్థలాన్ని చూశారు. దాదాపు లక్ష మందితో సభను నిర్వహించనుండటంతో సభా స్థలితో పాటు పార్కింగ్ స్థలాలు, రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ఉండే స్థలాలను పరిశీలించారు.
బీఆర్ఎస్ లో చేరికలు..
బీజేపీ నుంచి పలువురు యువకులు మంత్రి హరీశ్ రావు సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. సిద్దిపేట అర్బన్ మండల బీజేపీ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ బబ్బురి నరేశ్‌గౌడ్, జనగామ సందీప్ తో పాటు మరో 20 మంది , చిన్నకోడూరు మండలం విఠలాపూర్ గ్రామ బీజేపీ నేత ఉప సర్పంచ్ రాజుతో పాటు మరో 20 మంది మంత్రి సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు.