- తుమ్మలతో మంత్రులు హరీశ్, పువ్వాడ భేటీ
- సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా..
సత్తుపల్లి, వెలుగు: ఖమ్మంలో బీఆర్ఎస్ సభ ఏర్పాట్లను చూస్తున్న మంత్రులు హరీశ్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం రాత్రి మాజీ మంత్రి తుమ్మలతో భేటీ అయ్యారు. కొంతకాలంగా తుమ్మల బీఆర్ఎస్పార్టీలో క్రియాశీలకంగా లేకపోవడం, ఆత్మీయ సమ్మేళనాల ద్వారా హైకమాండ్‌పై అసంతృప్తిని బయటపెడ్తుండడంతో తుమ్మల నివాసానికి ఇద్దరు మంత్రులు చేరుకొని మంతనాలు జరగపడం ఆసక్తి రేపుతోంది. మంత్రుల వెంట రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వరావు, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఉన్నారు. వీరయ్య ఇటీవల తుమ్మలను ఉద్దేశించి పరోక్షంగా విమర్శలు చేశారు. ఇప్పటికే పొంగులేని శ్రీనివాస్‌రెడ్డి ఉదంతంతో జిల్లా బీఆర్ఎస్ క్యాడర్లో ఆయోమయం నెలకొంది. దీనికి తోడు పార్టీ వీడేవారిని ఆపే ప్రసక్తే లేదంటూ సీఎం కేసీఆర్ ఇటీవల అన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి టైంలో మంత్రులు తుమ్మలను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ భేటీలో ఏయే అంశాలు ప్రస్తావనకు వచ్చాయనేదానిపై క్లారిటీ రాకపోవడంతో పార్టీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.