సైబారాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఉత్రిక్తత వాతావరణం నెలకొంది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటిపై దాడికి వచ్చిన ఎమ్మెల్యే గాంధీపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైబరాబాద్ సీపీ ఆఫీస్ ముందు బైఠాయించారు. పోలీసులు ఎంత చెప్పినా వినకపోవడంతోపాటు .. గాంధీపై యాక్షన్ తీసుకోకుంటే కోర్టుకు వెళ్తామని బీఆర్ఎస్ ఎమ్యెల్యే హరిష్ రావు డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. సీపీ కార్యాలయం నుంచి బీఆర్ ఎస్ నాయకులను కుందుర్గ్ పీఎస్ కు తరలిస్తున్నారు. విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని బీఆర్ఎస్ ఎమ్మెల్మేలపై కేసు ఫైల్ చేశారు పోలీసులు. పలు సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు.
ALSO READ | సైబరాబాద్ సీపీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత.. గాంధీపై ఫిర్యాదు చేసిన BRS ఎమ్మెల్యేలు