ఆర్థిక మంత్రిగా హరీష్ రావు తొలిసారి అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. 2020-2021 ఆర్థిక సంవత్సరానికి 1,82,914 కోట్ల బడ్జెట్ ను ప్రవేశ పెట్టారు. బడ్జెట్ అంటే కాగితాల మీద రాసుకునే అంకెలు కాదన్నారు. వాస్తవిక దృక్పథంతో బడ్జెట్ రూపకల్పన చేశామన్నారు. కేంద్ర నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిందన్నారు.
2020-21 బడ్జెట్ 1,82,914.42 కోట్లు
- రెవెన్యూ వ్యయం- 1, 38, 669.82 కోట్లు
- క్యాపిటల్ వ్యయం- 22,061.18 కోట్లు
- రెవెన్యూ మిగులు- 4,482.12 కోట్లు
- ఆర్థిక లోటు- 33,191.25 కోట్లు
బడ్జెట్ కేటాయింపులు
- గృహ నిర్మాణాల కోసం 11,917 కోట్లు
- ఆర్టీసీ కి వెయ్యి కోట్లు
- పారిశ్రామిక రంగం అభివృద్ధికి 1998 కోట్లు
- విద్యుత్ శాఖ కు 10416 కోట్లు
- వైద్య రంగానికి 6,186 కోట్లు
- ఉన్నత విద్యకు 1723కోట్లు
- పాఠశాల విద్య కు 10,421కోట్లు
- ఫీజు రీయింబర్స్ మెంట్ కు 2650కోట్లు
- మున్సిపల్ శాఖ కు 14,809 కోట్లు
- సాగునీటికి 11054కోట్లు
- పంచాయతీ రాజ్ కు, గ్రామీణాభవృద్ధికి 23005 కోట్లు
- ఆసరా ఫెన్షన్లు కు 11758కోట్లు
- ఎంబిసి కార్పొరేషన్ కి 500కోట్లు
- వెనకబడిన వర్గాల సంక్షేమ కోసం 4356 కోట్లు