2 లక్షల రుణమాఫీపై సీఎం రేవంత్ కు మాజీ మంత్రి హరీశ్ సవాల్ విసిరారు. రుణమాఫీపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు.రుణమాఫీ కాలేదని గ్రామసభల్లో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు.హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందన్నారు. రైతులను కాంగ్రెస్ నిండా ముంచిందని విమర్శించారు.వానకాలం రైతుబంధు ఎప్పుడిస్తారో చెప్పాలన్నారు.పెట్టుబడి సాయం,రుణమాఫీలో ప్రభుత్వం కోతలు పెడుతుందన్నారు. వానకాలం,యాసంగి పంట సాయం కలిపి ఇవ్వాలన్నారు. ఎకరాకు రూ. 15 వేల సాయం ఏమైందని ప్రశ్నించారు హరీశ్. పదే పదే దరఖాస్తులు ఎందుకు పెట్టుకోమంటున్నారని ప్రశ్నించారు.
సిద్దిపేట పట్టణంలోని 15 వార్డ్ గాడి చెర్ల పల్లిలో నిర్వహించిన ప్రజా పాలన వార్డ్ సభలో పాల్గొన్నారు హరీష్ రావు. గ్రామసభలకు సీఎం, మంత్రులు రావాలన్నారు. దమ్ముంటే రేవంత్ రెడ్డి గ్రామ సభలకు రావాలి తాను కూడా వస్తానన్నారు. పోలీసులను పెట్టి నిర్బందాల మధ్య గ్రామ సభ నడిపిస్తున్నారని పైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి పేదల ఇండ్లు కూల్చుడు తప్ప ఒక్క ఇల్లు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయ కూలీల అందరికీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కూలీకి ఉపాధి హామీ కార్డుకి ముడిపెట్టడం.. మోకాలికి బోడి గుండుకి ముడి పెట్టడమేనన్నారు.