సీఎం రేవంత్ రెడ్డి సవాల్ ను స్వీకరించారు మాజీ మంత్రి హరీశ్ రావు.ఆగస్టు 15 లోపు ఆరు గ్యారంటీల అమలు..రైతు రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అమరవీరుల స్థూపం దగ్గర ప్రమాణం చెయ్యాలని చెప్పారు. ఆగస్టు 15 వరకు పూర్తిగా రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు మళ్లీ ఉపఎన్నికల్లో పోటీ చెయ్యబోనని సవాల్ విసిరారు హరీశ్. ఒక వేళ రుణమాఫీ చెయ్యక పోతే రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సవాల్ చేశారు. తనకు పదవి కంటే తెలంగాణ ప్రజల సంక్షేమమే ముఖ్యమన్నారు హరీశ్.
ALSO READ | పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తే.. బీఆర్ఎస్ను రద్దు చేస్తరా? : సీఎం రేవంత్ రెడ్డి
గతంలో కొడంగల్ లో ఓడిపోతే సన్యాసం తీసుకుంటానని చెప్పి తోక ముడిచి మాట తప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అని విమర్శించారు హరీశ్ రావు. ఆరు గ్యారెంటీలను డిసెంబర్ 9న అమలు చేస్తామని మాటతప్పింది కాంగ్రెస్ పార్టీ .. ఆరు గ్యారెంటీలను చట్టబద్ధత చేస్తానని చెప్పి్ంది కాంగ్రెస్ అని అన్నారు. మాట తప్పడం పూటకో పార్టీ మారడం రేవంత్ నైజమన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే పార్టీ రద్దు చేసుకుంటారా అని తొండి మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని సోనియాగాంధీ తల్లిగా లేఖ రాశారు కానీ.. 120 రోజులు దాటినా గ్యారెంటీలు అమలు చేయలేదన్నారు. మహాలక్ష్మీ పథకంలో మహిళలకు రూ. 2500, రైతు బంధు రూ.15 వేల ఆర్థిక సాయం ఏమైందని ప్రశ్నించారు. ధాన్యానికి 500 బోనస్ ఏది..నిరుద్యోగులకు భృతి ఏదీ అని నిలదీశారు హరీశ్ రావు.
ALSO READ | నువ్వు మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చెయ్ : కేటీఆర్