మునుగోడు ఉపఎన్నికల్లో తమ పార్టీఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ కు మొదటి విజయం సిద్దిపేట అయితే.. బీఆర్ఎస్ కు తొలి విజయం మునుగోడు గడ్డకే దక్కిందని తెలిపారు. చౌటుప్పల్ లో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. తెలంగాణలో మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని, హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో రైతుకు విలువ పెరిగిదని అన్న హరీష్... భూముల విలువ పెరిగిందని తెలిపారు. ప్రపంచమే అబ్బుర పడేలా యాదాద్రి ఆలయ నిర్మాణం జరిగిందన్నారు. తెలంగాణలో ఇస్తున్నట్లు డబుల్ఇంజన్ సర్కిల్ లో తాగునీరు, పెన్షన్ లు ఇవ్వడం లేదని హరీష్ ప్రశ్నించారు. పదో తరగతి పేపర్ లీకేజీని పట్టుకుని బీజేపీ రాజకీయం చేస్తోందని హరీష్ విమర్శించారు. పథకాలు, సంక్షేమం బీఆర్ఎస్ పార్టీవి అయితే, కుట్రలు, కుతంత్రాలు బీజేపీ పార్టీ అని తెలిపారు.