బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుంది : హరీష్ రావు

బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చాక ప్రతిపక్షాల మైండ్ బ్లాంక్ అవుతుంది : హరీష్ రావు

తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు మంత్రి హరీష్ రావు.  సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  హుస్నాబాద్ లోని కార్యకర్తల మీద ఉన్న  నమ్మకంతో సీఎం కేసీఆర్ ఇక్కడ  మొదటి ఎన్నికల సభ పెడుతున్నారని చెప్పారు.  హైదరాబాద్ కు ఈశాన్యంలో ఉన్న హుస్నాబాద్ బీఆర్ఎస్ కు కలిసి వస్తుందన్నారు.  ఆసత్య సర్వేల పేరిట అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ లీడర్లు  గోబల్స్ ప్రచారం చేస్తున్నారని, కనీసం టికెట్లు కూడా ఇచ్చుకోలేని దాయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు.  

హుస్నాబాద్ ప్రాంతంలో గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తికాకుండా కాంగ్రెస్, బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు.  గౌరవెల్లి ప్రాజెక్టు సీఎం  కేసీఆర్ హుస్నాబాద్ కు  ఇచ్చిన గొప్ప వరమని తెలిపారు.  2023 అక్టోబర్ 15న బీఆర్ఎస్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత ప్రతిపక్షాల మైండ్ బ్లాక్ అవుతుందన్నారు.  హుస్నాబాద్ లోని సభకు సీఎం సాయంత్రం నాలుగు గంటలకు హాజరు అవుతారని, పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు హాజరై సక్సెస్ చేయాలని కోరారు.  

ALSO READ : చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ13కు వాయిదా